Vishwak Sen - Arjun Sarja Movie Opening : విశ్వక్ సేన్- హీరో అర్జున్ కాంబినేషన్ సినిమా గురించి చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతోండగా ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. యాక్షన్ కింగ్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న అర్జున్ సర్జా మళ్ళీ దర్శకుడిగా మారి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా, అర్జున్ కుమార్తె ఐశ్వర్య హీరోయిన్ గా నటించబోతున్నారు. ఈ సినిమా అర్జున్ ఆయన సొంత బ్యానర్ శ్రీ రామ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.15గా తెరకెక్క నుంది. అయితే ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్‌ సర్జా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గురువారం హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియంలో  పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది.  పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పై క్లాప్ కొట్టారు. అర్జున్ సర్జాతో పవన్ కు చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. దీంతో అర్జున్ ఆహ్వానించగానే పవన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా అర్జున్- పవన్ ఆప్యాయంగా పలకరించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 


ఇక విశ్వక్ తో పవన్ భుజం తడుతూ మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాతో అర్జున్ కూతురు.. ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. జగపతి బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాకి కెజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించనుండగా ఆర్ఆర్ఆర్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించనున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, లిరిసిస్ట్ చంద్రబోస్, సినిమాటోగ్రాఫర్ బాలమురుగన్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.


యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ఇటీవలే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా విజయంలో మంచి జోష్ లో ఉన్నారు. దీంతో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న అర్జున్ తో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇది వరకు పలు చిత్రాలను దర్శకుడిగా తెరకెక్కించిన అర్జున్ చాలా రోజుల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. మరి ఈ సినిమా ఈ అందరికీ ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి మరి. 
 Also Read:
Pushpa The Rule: శ్రీవల్లిని చంపేస్తారా అంటే.. అసలు విషయం చెప్పేసిన నిర్మాత?
Also Read: Megastar Chiranjeevi : ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్లాన్.. ముందు జాగ్రత్త పడుతున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook