Producer Y Ravi Shankar on Srivalli Character : అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. మొదటి భాగం హిట్ కావడంతో రెండో భాగం మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. రెండో భాగం షూటింగ్ ఇప్పటికి ఇంకా మొదలవలేదు కానీ ఈ సినిమా షూటింగ్ మీద అనేక రకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి. తాజాగా జరుగుతున్న అనేక ప్రచారాల మీద సినిమా నిర్మాత యలమంచిలి రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు.
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల నేపథ్యంలో పుష్ప సినిమా తెరకెక్కించారు సుకుమార్. శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే ముఠాల చుట్టూ ఒక కథ అల్లుకున్నారు ఆయన. ఎర్రచందనం చెట్లు కొట్టే కూలి ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే ఎలా ఉంటుంది అంటూ కధ అల్లారు. సదరు డాన్ గా మారిన ఎర్రచందనం కూలీగా పుష్ప రాజ్ అనే పాత్రలో అల్లు అర్జున్ నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే రెండో భాగంలో అల్లు అర్జున్ ప్రేమించి వివాహం చేసుకున్న రష్మిక మందన్న పోషించిన శ్రీ వల్లి అనే పాత్ర చనిపోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది.
కొన్ని బలమైన ట్విస్టులు రాసుకుని సుకుమార్ ఆ విధంగా ప్లాన్ చేశాడని ప్రచారం ఊపందుకుంది. గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం నిర్మాత చెవిన పడడంతో తాజాగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎలమంచిలి రవిశంకర్ ఈ వ్యవహారం మీద స్పందించారు. అసలు అదంతా చెత్త, నాన్సెన్స్ అంటూ కొట్టి పారేసిన ఆయన నిజానికి పుష్ప 2 కథేంటో మాకే సరిగ్గా తెలియదని ఇంకా అసలు ఆ విషయం మీద మేము సుకుమార్ ను అడగలేదని చెప్పుకొచ్చారు.
అలాంటి వార్తలు అనీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చారు. పలు వెబ్‌సైట్‌లు, టీవీ ఛానెల్స్ సినిమాలపై ఇలా రాస్తూ ఉంటాయి కానీ వాటి గురించి వారికి ఏం తెలియదని అన్నారు. ఇక ప్రస్తుతం పుష్ప ది రూల్ ఆడిషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నా, నాలుగు నెలల్లో షూట్ పూర్తి చేసి విడుదల చేయడం సాధ్యమేనా? అనే అనుమానాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగనుంది? అనేది.
Also Read: Megastar Chiranjeevi : ఆ పుకార్లకు చెక్ పెట్టే ప్లాన్.. ముందు జాగ్రత్త పడుతున్నారా?
Also Read: Prabhas Remuneration hike : 120 కోట్లతో సరికొత్త రికార్డు.. నిర్మాతల బేజారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook