Pawan kalyan: ఏం తమాశాగా ఉందా..?.. హీరో కార్తీపై రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్.. వీడియో ఇదిగో..
Pawan kalyan vs Actor karthi: హీరో కార్తీ ఇటీవల ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో లడ్డుపై సెటైరికల్ గా మాట్లాడారు. దీనిపై తాజాగా, పవన్ కళ్యాణ్ విజయవాడలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
Pawan kalyan fires on hero karthi on laddu row: ఆంధ్ర ప్రదేశ్ లో తిరుమల లడ్డు వివాదం ప్రస్తుతం పీక్స్ కు చేరింది. ఈ క్రమంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ఐజీ ర్యాంక్ అధికారితో సిట్ ను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా.. దీనిపై తీవ్రంగానే మండిపడ్డారు. ఆయన 11 రోజుల పాటు ప్రాయిశ్చిత్త దీక్ష చేపట్టారు. అంతేకాకుండా.. తిరుమలలో ఇటీవల శాంతియాగం సైతం నిర్వహించారు. ఏపీ వ్యాప్తంగా తిరుమల ఆలయాలలో కూడా శుద్ది కార్యక్రమాలు చేపట్టాలని కూడా చంద్రబాబు ప్రజలను కోరారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంద్ర కీలాద్రి చేరుకున్నారు. అక్కడ పసుపు నీళ్లతో మెట్లను శుభ్రం చేసి శుధ్దిని నిర్వహించారు. అంతే కాకుండా..మెట్లకు పసుపు, కుంకుమ బొట్లను సైతం పెట్టారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సైతం తీర్చుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవల ఒక సినిమా ప్రిరీలిజ్ ఈవెంట్లో కార్తీ లడ్డుపై సెటైరికల్ గా మాట్లాడారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
పూర్తి వివరాలు..
హీరో కార్తీ సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిన్న (సోమవారం) జరిగింది.ఈ కార్యక్రమంలో.. యాంకర్ కార్తీతో మాట్లాడుతూ.. లడ్డు కావాలా నాయాన.. అని ప్రశ్నిస్తుంది. దీనికి ఆయన.. లడ్డూ టాపిక్ వద్దని.. ఇప్పుడు ఆ అంశం సెన్సిటివ్ టాపిక్ అని నవ్వుతూ వెటకారంగా మాట్లాడారు. లడ్డూ గురించి హీరో కార్తీ సెటైర్లు వేశారు. దీంతో ఇది కాస్త వివాదస్పదంగా మారింది. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇస్తూ.. కార్తీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.
తిరుమల లడ్డుపై ఇష్టమున్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. లడ్డూ సెన్సిటివ్ ఇష్యూ అనడం.. సరికాదన్నారు. కార్తీ చేసిన వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. మరోసారి కార్తీ అలా అనొద్దంటూ కూడా సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఒక నటుడిగా కార్తీ అంటే నాకు గౌరవముందని, కానీ లడ్డూ విషయంలో చేసిన కామెంట్లు మాత్రం సరికాదని ఫైర్ అయ్యారు.
అంతేకాకుండా సినిమా రంగం వారు కూడా ఈ అంశంపై ఇష్టమున్నట్లు మాట్లాడవద్దని అన్నారు. మీకు దీని గురించి స్పందించాలని లేకుంటే .. సైలేంట్ గా ఉండాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో..సనాతన ధర్మం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే భరించే ప్రసక్తిలేదని పవన్ ఘాటుగానే స్పందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.