OG Movie Shoot Begins పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో రాబోతోన్న ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించబోతోన్నారట. ఈ షూటింగ్‌లో మొదటి వారం రోజులు పవన్ కళ్యాణ్‌, హీరోయిన్ల మధ్య సీన్లను షూట్ చేస్తారట. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ లేని సీన్లను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ మేరకు వదిలిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో సుజిత్ తన కాన్సెప్ట్‌ను అద్భుతంగా చూపించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్‌ ఎలా ఉండబోతోన్నాడో చిన్నగా హింట్ ఇచ్చాడు. ఇక ఇందులో బాంబులు, బుల్లెట్లు, తుపాకుల మోత ఉండేలానే కనిపిస్తోంది. చూస్తుంటే కాస్త పంజా ఫ్లేవర్‌ కొడుతోంది. అయితే ఈ వీడియోలు తమన్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందంతే. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం సుజిత్ పడిన కష్టాన్ని ఎంతో క్రియేటివ్‌గా చూపించాడు.


 



పేపర్ చించేస్తూ ఉండగా.. అది చివరకు బాంబుగా మారడం, పెన్నులన్నీ బుల్లెట్లుగా మారడంతో సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోందో చెప్పినట్టు అయింది. మొత్తానికి ఇలాంటి గ్యాంగ్ స్టర్, గ్యాంగ్ వార్ సినిమాల్లో పవన్ కళ్యాణ్‌ను అభిమానులు చూసి చాలా కాలమే అయింది. ఈ చిన్న పాటి వీడియోనే ఈ రేంజ్లో ట్రెండ్ అవుతోందంటే.. రేపు సినిమా ఇంకెలా ఉంటుందో ఊహించుకోండని పవర్ స్టార్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. మొన్నటికి మొన్న వినోదయ సిత్తం కంప్లీట్ చేశాడు. నిన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు సుజిత్ ఓజీ కోసం డేట్లు కేటాయించాడు. ఆ తరువాత హరి హర వీరమల్లు సినిమా కోసం డేట్లు ఇచ్చాడు. ఇలా వరుసగా ఊపిరి సలపకుండా షూటింగ్‌లతో బిజీగానే ఉన్నాడు పవన్ కళ్యాణ్‌.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook