Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

Sekhar Master Emotional శేఖర్ మాస్టర్ బుల్లితెరపై మంచి మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. శేఖర్ మాస్టర్‌ ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. టాలీవుడ్‌ టాప్ హీరోలంతా కూడా శేఖర్ మాస్టర్‌నే కోరుకుంటున్న సంగతి తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 11:25 AM IST
  • నెట్టింట్లో ప్రోమోల సందడి
  • తండ్రిని తలుచకుంటూ ఎమోషనల్
  • ప్రదీప్, శేఖర్ మాస్టర్‌ల కంటతడి
Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్

Sekhar Master Emotional శేఖర్ మాస్టర్ తన తండ్రి గురించి పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. తన సక్సెస్‌ను తన తండ్రి చూడలేకపోయాడని, ఆ బాధ తనకు ఎప్పటికీ ఉంటుందని, ఇప్పుడు తన తండ్రి ఉంటే.. బాగుండేదని ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే యాంకర్ ప్రదీప్‌ ఈ మధ్యే తన తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే.  ఈ ఇద్దరూ ఇప్పుడు ఫాదర్ సెంటిమెంట్‌ పర్ఫామెన్స్ చూసి ఎమోషనల్ అయ్యారు. ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఇద్దరూ స్టేజ్ మీద కన్నీరు పెట్టేసుకున్నారు.

ఢీ షోకు సంబంధించిన తాజా ప్రోమో అందరినీ కదిలిస్తోంది. ఇందులోని కంటెస్టెంట్ ఫాదర్ సెంటిమెంట్‌ మీద ఓ పర్ఫామెన్స్ చేశాడు. తండ్రి విలువ.. మనం తండ్రిగా మారిన తరువాతే తెలుస్తుందని చెబుతూ.. మనం మన తండ్రిని చిన్నచూపు చూస్తే.. మన పిల్లలు మనల్ని కూడా అలానే చూస్తారు.. తల్లిదండ్రులను గౌరవించుకోవాలి అన్నట్టుగా ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్ సాగింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News