Ustaad Bhagat Singh Teaser:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వరస సినిమాలు ఒప్పుకొని గత కొద్ది రోజుల క్రింద అందరినీ ఆశ్చర్యపరిచారు పవన్ కళ్యాణ్. అయితే ఆయన ఒప్పుకున్న చిత్రాలలో కేవలం సుజిత్ దర్శకత్వంలో వస్తున్న ఓజి సినిమాకి మాత్రమే రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఆ చిత్రం నుంచి మొదటి లుక్ విడుదల చేయడమే కాకుండా సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. కానీ పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న హరీష్ శంకర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం ఆగిపోయిందని ప్రచారాలు రాసాగాయి. పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మరుగున పడిపోయింది అని తెలియడంతో పవన్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


అయితే ఆ రూమర్స్ అన్నిటికి చెక్ పెడుతూ.. వారి ఆనందాన్ని రెట్టింపు చెయ్యడానికి.. ఈ సినిమా ఆగిపోలేదని ఈ చిత్ర టీజర్ విడుదల చేస్తున్నాము అని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇక మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ చిత్రం నుంచి చిన్న వీడియో టీజర్ ను విడుదల చేశారు సినిమా యూనిట్.


ఈ టీజర్ పవన్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ మేనరిజంతో మొదలైన ఈ టీజర్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో కొనసాగింది. విలన్ నీ రేంజ్ ఇది అని టీ గ్లాస్ కిందకేసి పగలగొట్టగా…’గాజు పగిలే కొద్దీ పదును ఎక్కువవుతుంది..’అంటూ పవన్ చెప్పే డైలాగ్ తో టీజర్ ఒక రేంజ్ కి వెళ్ళింది. ఆ తరువాత ‘కచ్చితంగా గుర్తు పెట్టుకో.. గ్లాస్ అంటే సైజ్ కాదు.. సైన్యం’.. అనే డైలాగ్ తో కొనసాగిన ఈ టీజర్ పొలిటికల్ టచ్ తో పవన్ అభిమానులను విజిల్ వేసేటట్టు చేసింది. కాగా ఈ టీజర్ లో హీరోయిన్ శ్రీలీల కూడా ఒక చిన్న సీన్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.


 



మొత్తానికి పవన్ స్టైల్ తో.. హరీష్ శంకర్ మార్కుతో
మధ్యమధ్యలో యాక్షన్ సీన్లతో ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా జనసేన అభిమానులకు ఫుల్ ఫీస్ట్‌లా ఈ టీజర్ సాగింది. జనసేన ఎన్నికల గుర్తు గాజుగ్లాస్ చుట్టూ ఈ టీజర్ లో డైలాగ్స్ ఉండటంతో ఈ చిత్రంలో తప్పకుండా మరికొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉండబోతున్నాయి అని.. అవి చిత్రం విడుదలయ్యాక.. పవన్ అభిమానులను మరింత ఆకట్టుకోవచ్చని అర్థమవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.


ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‍గా నటించనుండగా.. అషుతోశ్ రాణా, నవాబ్ షా, బీఎస్ అవినాశ్, గౌతమి కీరోల్స్ చేస్తారని తెలుస్తోంది. ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు


Also Read: TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై


Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం



 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook