TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

Telangana Governor Resign: ఐదేళ్లపాటు గవర్నర్‌ పదవిలో కొనసాగుతున్న తమిళిసై సౌందరరాజన్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఐదేళ్లు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని ఆమె తెంచుకుని స్వరాష్ట్రం వెళ్తున్నారు. రాజీనామాపై ఆమె నోరు విప్పారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 18, 2024, 06:16 PM IST
TamiliSai: "బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు": రాజ్‌భవన్‌ ఖాళీ చేసిన తమిళిసై

TamiliSai: ప్రత్యక్ష రాజకీయాల నుంచి రాజ్యాంగ పదవిలోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలకు తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వెళ్తున్నారు. గవర్నర్‌ పదవికి ఆమె రాజీనామా చేసి స్వరాష్ట్రం తమిళనాడుకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తన రాజీనామాపై తమిళిసై శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో స్పందించారు. ఐదేళ్ల పాటు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. 'బాధగా ఉంది.. కానీ తప్పడం లేదు' అని పేర్కొన్నారు.

Also Read: Kavitha: కవిత అరెస్ట్‌పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు.. ఘాటెక్కిన రాజకీయం

 

గవర్నర్‌ పదవికి రాజీనామా చేసిన అనంతరం సోమవారం తమిళిసై నోరు విప్పారు. 'తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉంది. కానీ తప్పడం లేదు. తెలంగాణ ప్రజలందరూ నా అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు. ఎప్పుడూ తెలంగాణ ప్రజలను మరువను. అందరితో కలుస్తూ ఉంటా. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా' అని మీడియాతో చెప్పారు. తమిళనాడులో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. స్వరాష్ట్రం తమిళనాడుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

Also Read: Narendra Modi: నేను ప్రధానినే కాదు.. నేను భారతమాత పూజారిని: జగిత్యాల సభలో మోదీ

 

తెలంగాణ గవర్నర్‌గా 8 సెప్టెంబర్‌ 2019న తమిళిసై బాధ్యతలు చేపట్టారు. అనంతరం పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా చూశారు. తెలంగాణకు వచ్చిన మొదట తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతగానే ఉన్నారు. సీఎం కేసీఆర్‌ తమిళిసై మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అయితే ఆ తర్వాత మారిన పరిణామాలతో గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం మొదలైంది. రాజ్‌ భవన్‌ వర్సెస్‌ ప్రగతి భవన్‌గా మారిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్‌ పంపిన బిల్లులను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకున్నారు. ఇటీవల శాసన మండలి సభ్యులుగా దాసోజు శ్రవణ్‌తోపాటు మరికొరిని నియమిస్తూ మంత్రివర్గం సిఫారసు చేయగా వాటిని తిరస్కరించి తీవ్ర వివాదాస్పదమైంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డితో తమిళిసై సఖ్యతతో వ్యవహరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల అనంతరం ఆమె రాజ్‌ భవన్‌ను వీడుతున్నారు.

ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ రాజ్‌ భవన్‌లోనే బస చేశారు. ఈ సమయంలో రాజీనామా చేస్తాననే విషయాన్ని ప్రధానితో పంచుకున్నారని సమాచారం. ఆయన అనుమతితో ఆమె రాజీనామా చేశారని తెలుస్తోంది. తమిళనాడు వెళ్లిన తమిళిసై అక్కడ ప్రత్యక్ష ఎన్నికల్లో బిజీ కానున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ పోటీ చేయనున్నారు. అయితే ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే విషయం తెలియలేదు. దక్షిణ చెన్నై, తూత్తుకుడి తదితర నియోజకవర్గాలపై చర్చ జరుగుతోంది.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News