Vakeel Saab షూటింగ్‌లో.. నివేదా థామస్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రం అప్టేట్ వచ్చేసింది. బాలీవుడ్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ పోషిస్తున్నారు.
Pawan Kalyan's Vakeel Saab movie shooting starts: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రం అప్టేట్ వచ్చేసింది. బాలీవుడ్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ పోషిస్తున్నారు. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 80-90శాతం పూర్తయినట్లు సమాచారం. అయితే కరోనావైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్‌కు దాదాపు 6 నెలల పైనుంచి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. కరోనా నిలిచిపోయిన ఈ సినిమా చివరి షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్‌లో హీరోయిన్ నివేదా థామస్ (Nivetha Thomas) జాయిన్ అయింది. ఈ మేరకు సెట్ ఫొటోను షేర్ చేస్తూ నివేదా.. ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. మళ్లీ షూటింగ్ కు తిరిగి రావడం ఆనందంగా ఉందంటూ నివేదా పేర్కొంది.
ఇదిలాఉంటే.. వకీల్ సాబ్ ఈ సినిమా పోస్టర్, మగువా మగువా పాట లాక్‌డౌన్‌కు ముందే రిలీజ్ అయ్యాయి. అయితే మగువా మగువా పాటకు ఇప్పటికీ ప్రక్షేకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. దీనికి భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడంతో త్వరలోనే ఈ సినిమా వస్తుందంటూ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. Also read: Puri to direct Pawan Kalyan: పూరి జగన్నాథ్‌తో పవన్ సినిమా ?
అయితే పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం (Vakeel Saab Director Venu Sriram) వహిస్తుండగా.. బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్, లావణ్య త్రిపాఠి, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. Also read: Pawan Kalyan: రెమ్యునరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ రూటు మారిందా?