Pawan Kalyan: తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరో, హీరోయిన్లు రాజకీయాల్లో ప్రవేశించి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ఎన్టీఆర్ నుంచి తాజాగా పవన్ కళ్యాణ్ వరకు రాజకీయాల్లో ప్రవేశించి తమ లక్ ను పరీక్షించుకున్నవారు. అటు సినీ ఇండస్ట్రీ నుంచి మంత్రులైన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. దివంగత కృష్ణంరాజు, చిరంజీవిలు కేంద్ర మంత్రులుగా పనిచేసారు. అటు బాబు మోహన్, రోజాలు ఉమ్మడి ఏపీ, విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఇక రోజా.. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ క్యాబినేట్ లో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పవన్ కళ్యాణ్ హీరో కాకముందు.. తన అన్న నాగబాబు నిర్మాణంలో అంజనా ప్రొడక్షన్స్ లో సహా నిర్మాతగా వ్యవహరించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్.. కళ్యాణ్ బాబుగా ముగ్గురు మొనగాళ్లు సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభినయం చేసారు. ఇందులో కథానాయికలుగా రోజా, రమ్యకృష్ణ, నగ్మా నటించారు. ఇలా పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రోజా హీరోయిన్ గా నటించిన సినిమాగా ‘ముగ్గురు మొనగాళ్లు’ నిలిచింది.  ఈ సినిమా ఓ మోస్తరుగా విజయం సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 1996లో అల్లు అరవింత్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.


ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. తన పేరు మీద పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ‘సర్ధార్ గబ్బర్ సింగ్’, ఛల్ మోహన్ రంగ’ సినిమాలు నిర్మించారు. ఈ సినిమాలేవి విజయాలు సాధించలేదు. కానీ 2008లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్.. 2014లో జనసేన పార్టీ స్థాపించి.. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత 2024లో టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించారు. అంతేకాదు ఏపీలో  చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పంచాయితీ రాజ్, నీటి పారుదల, అటవీ పర్యావరణ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు త్వరలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. తను చేస్తోన్న సినిమాలను కంప్లీట్  చేయబోతున్నారు. అటు రోజా గత ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.


Also read: Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter