`అజ్ఞాతవాసి` ఫస్ట్ లుక్ రిలీజ్
పవన్ కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం `అజ్ఞాతవాసి` ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
పవన్ అభిమానులకు ఇది నిజంగా పండుగే.. 'అజ్ఞాతవాసి' ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ' అజ్ఞాతవాసి' . ఇప్పటికే ఈ సినిమా యూరప్, హైదరాబాద్ లలో షూటింగ్ పూర్తిచేసుకొని వారణాసి వెళ్లింది. ప్రస్తుతం వారణాసిలో షూటింగ్ జరుగుతోంది. మూవీకి సంబంధించి ఇదే చివరి షెడ్యూల్.
ఫస్ట్ లుక్ లో పవన్ మోస్ట్ స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా కనిపించాడు. కింద కుర్చీని ఐడీ కార్డును చేతి చూపుడు వేలితో గిరగిరా తిప్పుతున్న దృశ్యాన్ని లోగోగా ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ఫస్ట్ లుక్ లోనే రెండు రోజుల క్రితం విడుదల చేసిన ప్రీ-లుక్ షాడోను పొందుపరిచారు.
హారిక&హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ పవన్ సరసన నటిస్తున్నారు. ఈ సినిమాతో అనిరుధ్ తెలుగు తెరకు మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కానున్నాడు. సంక్రాంతిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.