పవన్ కల్యాణ్ కెరీర్‌లో 25వ సినిమాగా వచ్చిన 'అజ్ఞాతవాసి'పై పవర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అత్తారింటికి దారేది తర్వాత పవన్ మరోసారి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో చేసిన సినిమా కావడంతో ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. వారి అంచానలకు తగినట్టుగానే విడుదల అనంతరం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న 'అజ్ఞాతవాసి' రిలీజైన తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతాలా వారీగా అజ్ఞాతవాసి సినిమా కలెక్షన్స్ ఇలా వున్నాయి. 


నైజామ్ - రూ. 5.45 కోట్లు 
సీడెడ్ - రూ. 3.35 కోట్లు 
నెల్లూరు - రూ. 1.64 కోట్లు 
గుంటూరు - రూ. 3.78 కోట్లు 
కృష్ణా - రూ. 1.83 కోట్లు 
పశ్చిమ గోదావరి జిల్లా- రూ 3.70 కోట్లు 
తూర్పు గోదావరి జల్లా-రూ. 2.85 కోట్లు 
ఉత్తరాంధ్ర -రూ. 4.30 కోట్లు 


మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి అజ్ఞాతవాసి రూ. 26.93 కోట్లను వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల నివేదికలు చెబుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ 'ఖైదీ నెంబర్ 150' ఫస్ట్ డే రూ. 23.30 కోట్లను వసూలు చేయగా 'అజ్ఞాతవాసి' ఆ రికార్డుని అధిగమించినట్టు టాలీవుడ్ టాక్. ఇదిలావుంటే, బాలయ్య బాబు నటించిన 'జైసింహా' ఈరోజే థియేటర్లలోకి రానుంది. అందులోనూ ఈ సినిమాను తొలి ఐదు రోజులపాటు 24x7 షోలలో ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కనుక ఈ సినిమా 'అజ్ఞాతవాసి'పై ప్రభావం చూపిస్తుందా లేదా అనేది 'జై సింహా' సక్సెస్‌ రేటుపైనే ఆధారపడి వుంటుందంటున్నారు సినీ విమర్శకులు.