Bheemla Nayak Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' (Bheemla Nayak Movie) చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల రిలీజైన టైటిల్ సాంగ్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తోంది. అయితే.. ఈ సినిమా సంక్రాంతి బరినుంచి తప్పుకొన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24, లేదా 25న ఈ చిత్రం (Bheemla Nayak Release Date) థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సినీవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తుదిదశకు చేరుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మలయాళ హిట్ 'అయ్యప్పనుమ్ కోశియమ్'కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే పవర్ ఫుల్ పాత్రలో రానా దగ్గుబాటి కనిపించనున్నారు. నిత్యామేనన్, సంయుక్త మేనన్.. కీలకపాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు.


ప్రస్తుతం సంక్రాంతి రేసులో 'ఆర్ఆర్ఆర్' (జనవరి 7), 'రాధేశ్యామ్' ( జనవరి 14) ఉన్నాయి. 'బంగార్రాజు' (జనవరి 15-ఖరారు కాలేదు) ఉన్నాయి. మహేష్ బాబు 'సర్కారు వారిపాట' చిత్రాన్ని కూడా మొదట జనవరి 13న విడుదల చేయాలని భావించింది చిత్రబృందం. కానీ కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది.


Also Read: Viral Video: RRR 'నాటు నాటు' పాటకు బామ్మ డ్యాన్స్.. ఎనర్జీకి ఫిదా అవుటున్న నెటిజన్లు


Also Read: Jacqueline Fernandez Gallery: లంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ బికినీ ఫొటోషూట్ వైరల్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook