Bheemla Nayak in USA:  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , రానా దగ్గుబాటి కలిసి నటించిన  'భీమ్లా నాయక్' (Bheemla Nayak ) విడుదల తేదీ ప్రకటించగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానుల్లో జోష్ పెరిగింది. ఈ చిత్రం ఫిబ్రవరి 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భీమ్లా నాయక్ మేనియా ఓవర్సీస్ మార్కెట్‌ను కూడా తాకింది. యూఎస్ (USA)లో ఒక రోజు ముందుగానే భీమ్లా నాయక్ సందడి చేయనుంది. అమెరికాలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ముందుస్తు బుకింగ్స్ 4లక్షల యూఎస్ డాలర్లు దాటింది. 300 కు పైగా థియేటర్లలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ చేయలేదు. ఈ సినిమా అమెరికా వ్యాప్తంగా 400కు పైగా థియేటర్లలో, 3000కు పైగా స్క్రీన్ లో ప్రదర్శించబడుతోంది.  



సాగర్  కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే  అందించారు. ఈ చిత్రంలో పవన్ కి జోడిగా నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. మురళీశర్మ, రావు రమేష్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 21న రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బుధవారం భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ (Bheemla Nayak pre release)  ఈవెంట్ జరగనుంది. 


Also Read: Bheemla Nayak Pre-Release Event: ఇదేం క్రేజ్.. గుడిలో 'భీమ్లా నాయక్ పోస్టర్‌' పెట్టి పూజలు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి