Bro Movie Updates: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం 'బ్రో'. నటుడు కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ రోజు అంటే జూలై 08 సాయంత్రం విడుదల చేయనున్నారు. మై డియర్ మార్కండేయ అంటూ సాగే ఈ సాంగ్ శనివారం సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియాప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన వినొదయ చిత్తం సినిమాకు రీమేక్‏గా బ్రో మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి దేవుడి పాత్రలో కనిపంచనున్నారు పవన్. గతంలో గోపాల గోపాల సినిమాలో గాడ్ గా కనిపించిన సంగతి తెలిసిందే. బ్రో మూవీలో మామ, మేనల్లుడి కామెడీ వేరే లెవల్ లో ఉంటుందట. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూలై 28న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ పేరు మార్కండేయ అని.. పవన్ పేరు కాలుడు అని సమాచారం. 


Also read: Baby Trailer Review : బేబీ ట్రైలర్.. నరాలు మెలిపెట్టే డైలాగ్స్


ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు పవన్. ఇప్పటికే బ్రో షూటింగ్ పూర్తి అయింది.  ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలను త్వరలో పూర్తి చేయనున్నారు పవర్ స్టార్. 



Also Read: Samajavaragamana: శ్రీవిష్ణు ‘సామజవరగమన’ కలెక్షన్ల సునామీ.. తొలి వారం ఎంత వసూలు చేసిందంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook