Pawan Kalyan`s 28th Movie: `భవదీయుడు భగత్‌సింగ్`గా పవన్... అదిరిపోయిన ఫస్ట్ లుక్!
పవన్ అభిమానులకు పండగే.. పవన్ - హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా `భవదీయుడు భగత్‌సింగ్` టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది... మీరే ఒక లుక్కేయండి!
Pspk 28: పవన్ కళ్యాన్ (Power Star Pawan Kalyan) నటిస్తున్న 28 వ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రబృందం విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ (Pawan-Harish Shankar Combo) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "భవదీయుడు భగత్‌సింగ్' (Bhavadeeyudu Bhagat Singh) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసారు.
ప్రముఖ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)భారీ బడ్జెట్ తో నిర్మితున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తునాడు. వకీల్ సాబ్ (Vakeel Sab) తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్ (Pawan Kalyan) వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రానున్న రోజుల్లో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) సినిమా షూటింగ్లో బిజీ ఉండగా, దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న తెరకెక్కిస్తున్న 'అయ్యప్పునుమ్ కోషియుమ్' (Ayyappanum Koshiyum)ను 'బీమ్లా నాయక్' (Bheemla Nayak) గా తెలుగు లో రీమేక్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే.
Also Read: Horrible video: ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో... చూస్తే కొన్ని సెకన్ల పాటు గుండె ఆగటం ఖాయం!
ఇది వరకే పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన "గబ్బర్ సింగ్" (Gabbar Singh) టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. మళ్లీ అదే కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. డైరెక్టర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ సినిమా టైటిల్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేసాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook