Pawan Kalyan Craze: సెహ్వాగ్ నోట పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్.. వీడియో వైరల్

పవర్ స్టార్ పవన్ కళ్యాన్... మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు.. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌ వీరేందర్ సెహ్వాగ్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాన్ డైలాగ్ చెప్తే ఎలావుంటుంది.. ఆ వీడియో మీరే చూసేయండి!  

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2021, 06:01 PM IST
  • వరుస సినిమాలతో బిజీ అయిన పవన్ కళ్యాన్
  • పవన్ కళ్యాన్ డైలాగ్ చెప్పిన వీరేందర్ సెహ్వాగ్
  • పవన్ మేనరిజంలో చెప్పిన డైలాగ్ వీడియో వైరల్
Pawan Kalyan Craze: సెహ్వాగ్ నోట పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్.. వీడియో వైరల్

Pawan Kalyan: అటు రాజాకీయాల్లో..  ఇటు సినిమాల్లో చురుక్కా పాల్గొంటున్న పవన్ కళ్యాన్ కొత్తగా 3 సినిమాలలో నటిస్తున్నాడు. ఈ సంవత్సరం ఏప్రిల్ 9న విడుదలైన 'వకీల్ సాబ్' (Vakeel Saab) ఎంత పెద్ద హిట్టో మనకు తెలిసిందే. మూడు సినిమాలకి ఓకే చెప్పిన పవన్ శరవేగంగా షూటింగ్ లు పూర్తీ చేస్తున్నాడు. 

రానున్న రోజుల్లో క్రిష్ దర్శకత్వం వహిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న తెరకెక్కిస్తున్న 'అయ్యప్పునుమ్ కోషియుమ్' (Ayyappanum Koshiyum)ను 'బీమ్లా నాయక్' (Bheemla Nayak) గా తెలుగు లో రీమేక్ అవుతున్న సినిమా మరియు డైరెక్టర్ శరీష్ శంకర్ సినిమా కూడా ఓకే చెప్పిన పవన్ కళ్యాన్ షెడ్యూల్ బిజీగా నడుస్తుంది. 

Also Read: Actress Alankrita Sahai: సినీ నటి ఇంట్లో చోరీ...రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగలు

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో చెప్పే డైలాగులు మన రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది.  

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్​సింగ్'​ (Gabbar singh) సినిమాలోని "నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది" (Naakkonchem Thikkundi daaniko lekkundi) డైలాగ్ ఎంత పాపులరో తెలిసిందే. సమయం ఏదైనా సందర్భం ఏదైనా ప్రతి ఒక్కరి నోటి నుండి ఈ డైలాగ్ రావాల్సిందే.. పవన్ కళ్యాన్ ది ఒక ప్రత్యేకమైన స్టైల్ మరియు డిఫెరెంట్ మేనరిజం, ఎవ్వరైన ఆయన స్టైల్ కు ఫిదా అవ్వాల్సిందే...

Also Read: Side effects of COVID vaccine in women: మహిళలకే కొవిడ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువా ? ఎందుకు ?

ఇపుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ఒక కారణం ఉందండి..  మన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌  వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) పవర్ స్టార్ డైలాగ్ చెప్తే...?? ఇంకేం ఉంది అభిమానులకు పండగే.. అవును  వీరేందర్ సెహ్వాగ్ మన పవర్ స్టార్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్పటంతో.. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. 

వీరేందర్ సెహ్వాగ్ మొబైల్ ఫోన్ చూస్తూ.. పవన్ మేనరిజంను (Pawan Mannerism) అనుసరిస్తూ మెడపై చేయి పెట్టి పవన్ లాగా "నాక్కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది" అని డైలాగ్ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతుంది. సెహ్వాగ్‌ చెప్పిన డైలాగ్ తీరు అభిమానులనే కాదు.. సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తుంది. 

Also Read: Photo Gallery: శిఖర్ ధావన్ లాగా.. విడాకులు తీసుకున్న భారత క్రికెటర్లు... ఎవరో చూడండి..??

ఎల్లపుడు సోషల్ మీడియాలో (Social Media) యాక్టివ్ గా ఉండే వీరేందర్ సెహ్వాగ్ దేశంలో జరిగే ప్రతి విషయంపై తనదైన స్టైల్ లో స్పందిస్తుంటారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఫొటోతో పోస్ట్ చేసి, భారత్ టర్నింగ్ ట్రాక్స్‌పైనే విజయం సాధిస్తుందని చెప్పారో.. వాళ్ల ఇప్పుడు సమాధానం చెప్పాలని ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. 

ఇదిలా ఉండగా సెహ్వాగ్ నోట పవర్ స్టార్ డైలాగ్ విన్న అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాకుండా, సెహ్వాగ్ సైతం పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తారని అభిమానులు వాపోతున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

 

Trending News