Pawan Kalyans Vakeel Saab Movie On OTT: రాజకీయల్లో అడుగుపెట్టిన అనంతరం టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. మూడేళ్ల అనంతరం టాలీవుడ్ ప్రేక్షకులు, అభిమానులు పవన్ కళ్యాణ్‌ను స్క్రీన్ మీద చూసుకున్నారు. బాలీవుడ్ మూవీ పింక్ ( Pink movie) ఆధారంగా తెలుగులోకి వకీల్ సాబ్ రీమేక్ చేశారు. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కించిన వకీల్ సాబ్‌‌ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ ప్రొడక్షన్ నిర్మించాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో మరోసారి ఓటీటీ మాధ్యమాలపై సినిమా ఇండస్ట్రీ ఆధారపడాల్సి వస్తోంది. గత ఏడాది లాక్‌డౌన్, అనంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది పలు టాలీవుడ్ సినిమాలు అమెజాన్ ప్రైమ్, ఆహా ఇతర ఓటీటీ మాధ్యమాలలో విడుదలయ్యాయి. ప్రస్తుతం కరోనాతో థియేటర్లు మూతపడుతుండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్(Vakeel Saab Movie) విడుదలైంది. ఇటీవల థియేటర్లలో విడుదలై కలెక్షన్లు రాబట్టిన వకీల్ సాబ్ నేటి (ఏప్రిల్ 30) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలలో ఇంట్లో కూర్చుని వీక్షించవచ్చు. 


Also Read: Producer Dil Raju: వకీల్ సాబ్ బెనిఫిట్ షోలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రచ్చరచ్చ, ఫొటోలు తీసిన భార్య



ఇటీవల విడుదలైన ఈ సినిమాను కనీసం 50 రోజులు థియేటర్లలో నడిచిన తరువాత ఓటీటీలోకి తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు భావించాడు. కానీ కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో థియేటర్లు మూతపడుతుండటంతో అమెజాన్ ప్రైమ్ వీడియోలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా నేటి నుంచి తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వకీల్ సాబ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అమెజాన్ ప్రైమ్ సైతం ఏప్రిల్ 30న వకీల్ సాబ్ మూవీని విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే.


Also Read: Vakeel saab: వకీల్ సాబ్ కలెక్షన్లకు కరోనా దెబ్బ కొట్టిందా, ఆ మార్కెట్‌లో ఘోర పరాజయం


గబ్బర్ సింగ్ తరువాత పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ (Shruti Haasan) మరోసారి నటించింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, నివేథా థామస్, అంజలి, అనన్య నాగళ్ల, ఇతర కీలకపాత్రల్లో కనిపించనున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook