Vakeel Saab Movie: వకీల్ సాబ్ మూవీ షో మధ్యలో ఆపేశారని, థియేటర్‌లో ప్రేక్షకులు విధ్వంసం Video Viral

 Vakeel Saab Movie Latest Update: తొలిసారిగా పవన్ లాయర్ పాత్రలో కనిపించడం, మరోవైపు మూడేళ్ల విరామం తరువా కమ్ బ్యాక్ మూవీ కావడంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, పవన్ అభిమానులు వకీల్ సాబ్ విడుదల గురించి ఎదురుచూశారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 9, 2021, 12:14 PM IST
Vakeel Saab Movie: వకీల్ సాబ్ మూవీ షో మధ్యలో ఆపేశారని, థియేటర్‌లో ప్రేక్షకులు విధ్వంసం Video Viral

Vakeel Saab Movie Latest Update: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకులలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనర్కర్లేదు. నేడు పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడులైంది. తొలిసారిగా పవన్ లాయర్ పాత్రలో కనిపించడం, మరోవైపు మూడేళ్ల విరామం తరువా కమ్ బ్యాక్ మూవీ కావడంతో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, పవన్ అభిమానులు వకీల్ సాబ్ విడుదల గురించి ఎదురుచూశారు. అయితే నేడు విడుదలైన వకీల్ సాబ్ బెనిఫిట్ షో నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

సాంకేతిక కారణాలతో వకీల్ సాబ్ సినిమా ప్రదర్శన కొద్దిసేపు నిలిచిపోవడంతో అభిమానులు, ప్రేక్షకులు శివాలెత్తిపోయారు. తమకు తోచిన వస్తువును చేత పట్టుకుని ఆగ్రహాన్ని ప్రదర్శించారు. థియేటర్ అద్దాలు ధ్వంసం చేస్తూ విధ్వసానికి పాల్పడ్డారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. సాంకేతిక కారణాలతో వకీల్ సాబ్ సినిమా(Vakeel Saab) ప్రదర్శన కొద్దిసేపు నిలిచిపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహావేశాలకు లోనై ఏకంగా థియేటర్‌పై దాడికి పాల్పడి దొరికిన వస్తువును దొరికినట్లుగా ధ్వసం చేసే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

Also Read: Producer Dil Raju: వకీల్ సాబ్ బెనిఫిట్ షోలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రచ్చరచ్చ, ఫొటోలు తీసిన భార్య

ఇటీవల వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల సందర్భంగా సైతం కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్(Vakeel Saab Movie) ట్రైలర్ సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్యాన్స్ మధ్య తోపులాట జరగడం, థియేటర్లోకి త్వరగా చేరుకోవాలని అత్సుత్సాహం ప్రదర్శించడంతో సినిమా హాల్ అద్దాలు పగిలిపోయాయి. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ మధ్య తోపులాట జరగడంతో అద్దాలు ధ్వంసం కావడంతో పాటు కొందరు కింద పడిపోగా, తొక్కుకుంటూ లోపలికి పరిగెత్తడం విశాఖపట్నంలోని ఓ థియేటర్ వద్ద కనిపించింది.

Also Read: Pawan Kalyan: వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య తోపులాట, పగిలిన అద్దాలు

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సమర్పణలో టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు వకీల్ సాబ్ నిర్మించాడు. శ్రుతిహాసన్ మరోసారి పవన్ కళ్యాణ్ సరసన నటించింది. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తొలిసారిగా లాయర్ పాత్ర పోషించారు. అయితే వన్ మ్యాన్ షోగా మూవీని నడిపించారని ట్విట్టర్ టాక్ వినిపిస్తోంది. బెనిఫిట్ షో నుంచే వీక్షకులు ట్విట్టర్‌లో తమ రేటింగ్‌ను పోస్టులు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News