People Media Factory Movies: పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్‌ టౌన్‌గా మారింది. భారీ ప్రాజెక్ట్‌లతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ధమాకా మూవీ బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టేయగా.. పవన్ కళ్యాణ్ బ్రో మూవీ తీసి అందరినీ ఆశ్చపరిచారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో రాజా సాబ్ మూవీ సెట్స్‌పై ఉంది. ఆదిపురుష్ మూవీని తెలుగు విడుదల చేశారు. ప్రభాస్ స్పిరిట్ మూవీని కూడా తెలుగు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలకు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఈగల్ మూవీని ఈ నెల 9న ఆడియన్స్ ముందుకు తీసుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్‌కు పీపుల్స్ మీడియా ఫ్యాకర్టీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ స్వయంగా రంగంలోకి దిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తమ బ్యానర్‌లో 15 సినిమాలు రెడీగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాలను క్లియర్ చేయాలనే ఉద్దేశంతో తానే స్వయంగా రంగంలోకి దిగినట్లు చెప్పుకొచ్చారు. సినిమాలు తెరకెక్కించడమే కాకుండా.. వాటిని కూడా విడుదల కూడా చేయాలని ఫన్నీగా మాట్లాడారు. ఈ ఏడాదిలో పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి నెలకు ఒక సినిమా థియేటర్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 


ఓ వైపు బిజినెస్ చూసుకుంటునే సినిమాలను కూడా తెరకెక్కిస్తున్నామని.. రెండు సమానంగా చూసుకుంటున్నామని ఆయన చెప్పుకొచ్చారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ, సినీ నిర్మాణం, థియేటర్ బిజినెస్‌తోపాటు స్టూడియో ప్లానింగ్స్, ఫిల్మ్ అకాడమీ ఏర్పాటు చేసేందుకు తాము ప్లాన్ చేస్తున్నామన్నారు. ఫిల్మ్ అకాడమీని ఏర్పాటు చేసి.. తమ సినిమాలకు తగినట్లు టాలెంటెడ్ పర్సన్‌ను తయారు చేసుకుని ఇండస్ట్రీకి అందించడమే తమ ఉద్దేశమన్నారు. 


సినిమాలు తీయడమే కాకుండా అన్ని రంగాల్లో తమ హస్తం ఉండేలా చేసుకుంటున్నామని టీజీ విశ్వప్రసాద్ అన్నారు. గ్లోబల్‌గా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని.. ప్రపంచస్థాయి సినిమాలు తీయాలంటే బేస్ సరిగా ఉండాలని అన్నారు. అందుకే ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్నికలతో బిజీగా ఉండడంతో ఫ్రీ అయితే తమకు డేట్స్ ఇస్తారని ఆయన ఆయన చెప్పారు. అగ్రహీరోలు అందరితోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈగల్ సినిమా అద్భుతంగా వచ్చిందని.. పూర్తి నమ్మకంతో ఉన్నామన్నారు.  


Also Read: Dil Raju: రేవంత్ రెడ్డి దగ్గరికి దిల్ రాజు.. ఆశిష్ పెళ్లికార్డ్ అందజేసిన ఫ్యామిలీ


Also Read: Chandrababu Naidu: బీజేపీతో పొత్తుకు చంద్రబాబు సై.. ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి