Pm Kisan Yojana 2023: పీఎం కిసాన్ యోజన డబ్బు పడలేదా.. టెన్షన్ వద్దు.. ఇలా చేయండి చాలు!
Pm Kisan Yojana 2023: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2023 కింద, 13వ విడత డబ్బులు విడుదల చేయగా అవి పడని వారు ఇలా చేస్తే పడే అవకాశాలు ఉన్నాయి.
Pm Kisan Yojana 2023 Update: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2023 కింద, 13వ విడత డబ్బులు విడుదల చేశారు. కొద్దిరోజుల క్రితం కర్ణాటక పర్యటనకు వెళ్లిన మోడీ అక్కడే నిధులు విడుదల చేశారు. ఇక ఖాతాల్లోకి డబ్బులు చేరిన రైతులకు ఊరట లభించినట్టు అయింది. అదే సమయంలో తమ ఖాతాలలో ఈ విడత డబ్బులు రాక పోవడంతో మనస్తాపానికి గురైన రైతులు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ పథకం లబ్ధిదారులుగా మారడానికి ఇప్పుడు వారు అర్హులా కాదా అనే ప్రశ్న వారి మనస్సులో ఉంది. అయితే అలాంటి వారు కూడా ఇప్పటికీ పథకం ప్రయోజనాన్ని పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు అది ఎలానో ఏమిటో పరిశీలిద్దాం.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2023 డబ్బులు పడని వారు, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని రైతులు కూడా ఈ పథకం ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని తర్వాత, వాటిని కూడా ధృవీకరించిన తర్వాత, ఈ పథకం యొక్క ప్రయోజనాలను వారికి అందుబాటులొ ఉంచవచ్చు. అయితే రైతులు విధిగా ఈ కింది ప్రాసెస్ అనుసరించాలి. సమ్మాన్ నిధి కోసం ఈ పనులు చేయాల్సి ఉంటుంది
దరఖాస్తుదారు తన పేరున సాగు భూమి, దాని పత్రాలు మరియు రసీదు మొదలైనవి కలిగి ఉండాలి, అలాగే రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, పాన్ కార్డు నకలుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు ఏటా 6 వేల రూపాయలు అందజేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతలుగా పంపిణీ చేస్తారు.
ఇక పేరు చెక్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, దీంతో పాటు రైతులు పథకంలో లబ్ధిదారులైతే వారికి వాయిదాలు అందాయో లేదో పరిశీలించవచ్చు. అయితే అలా పరిశీలించాలి అంటే ఎక్కడికో వెళ్లవలసిన అవసరం లేదు. చాలా సౌకర్యవంతంగా ఇంట్లో కూర్చొని అర్హులైన రైతుల జాబితాలో తన పేరును ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇలా జాబితాలో మీ పేరు చెక్ చేయండి
మీరు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనతో అనుబంధించబడి ఉంటే, మీరు పథకం యొక్క అర్హులైన లబ్ధిదారుల జాబితాను చెక్ చేయాలి.
ముందుగా pmkisan.gov.in వద్ద PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి
వెబ్‌సైట్‌లో ఇచ్చిన 'ఫార్మర్స్ కార్నర్' ట్యాబ్‌పై క్లిక్ చేయాలి
ఇందులో 'బెనిఫిషియరీ స్టేటస్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి
అక్కడ కొత్త పేజీ ఓపెన్ అయితే లబ్ధిదారుడు తన ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ఆప్షన్ ను ఎంచుకోవాలి
ఆప్షన్ ను ఎంచుకున్న తర్వాత, సమాచారాన్ని ఫైల్ చేయాలి
'డేటా పొందండి'పై క్లిక్ చేయడం ద్వారా ఇన్‌స్టాల్‌మెంట్ స్థితి కనిపిస్తుంది
ఇక్కడ నుంచి మీకు డబ్బు వచ్చిందా లేదా అనేది తెలుస్తుంది
రైతులు ఇంటి వద్ద కూర్చొని ఈ పథకం డబ్బు పొందవచ్చు. దీని కోసం, వారు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. అలాగే ఏటీఎంకు వెళ్లాల్సిన అవసరం ఉండదు, పోస్ట్‌మ్యాన్ రైతు ఇంటికి వచ్చి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఇస్తారు. దానికి ఎటువంటి రుసుము వసూలు చేయరు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఇంటి వద్ద కూర్చున్న పోస్ట్‌మ్యాన్ ద్వారా లబ్ధిదారులు తమ ఖాతాల్లోకి వచ్చిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఒక రోజులో రూ. 10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఇక ఇప్పటి వరకు తన e-KYC చేయని ఏ రైతు అయినా, తన ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయాలి మరియు e-KYC ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి, తద్వారా వారు కూడా ఈ పథకం యొక్క ప్రయోజనాన్ని పొందవచ్చు.
ఈ నంబర్లలో సంప్రదించగలరు
PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266
PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్:155261
PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్లు: 011-23381092, 23382401
PM కిసాన్ కొత్త హెల్ప్‌లైన్: 011-24300606
PM కిసాన్ యొక్క మరొక హెల్ప్‌లైన్: 0120-6025109
Also Read: Adani group: 15 వేల కోట్ల షేర్లను అమ్మేసిన అదానీ గ్రూప్, రుణాలు తీర్చేందుకేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి