‘అజ్ఞాతవాసి’ సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ అనే పాటను ఇటీవలే నటుడు పవన్ కళ్యాణ్ పాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడా పాట అంతర్జాతీయంగా కూడా పలువురిని ఆకట్టుకుంటోంది. ఈ మధ్యే పోలాండ్‌కి చెందిన ఓ ఎనిమిదేళ్ల బాలుడు ఈ పాట విని ముచ్చటపడి తను కూడా పాడడం నేర్చుకున్నాడు. కేవలం నేర్చుకోవడమే కాదు.. తాను కూడా ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను తన స్టైల్‌లో పాడి యూట్యూబ్‌తో పాటు ట్విట్టర్‌లో కూడా పోస్టు చేశాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడా పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ కూడా ఈ పాట విన్నారట. విని ఊరుకోండా "గాడ్ బ్లస్ యూ" అని ఆ కుర్రాడికి ట్వీట్ చేయడం విశేషం. ఆ ట్వీట్‌కు ఆ బాలుడు రిప్లై ఇస్తూ ..‘ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ నుంచి నాకు మెసేజ్‌ వచ్చింది. థాంక్యూ పవర్‌స్టార్‌. లవ్యూ పవర్‌స్టార్’ అని ట్వీట్‌ చేశాడు.