police charge sheet filed in raj tarun Lavanya case: టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్, లావణ్య ఘటన ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. దీనిపై రోజుకో ట్విస్ట్ లు వెలుగులోకి వస్తున్నాయి.  గతంలో లావణ్య.. పదేళ్లపాటు తాను.. రాజ్ తరుణ్ తో సహాజీవనం చేశానని ఆరోపించింది. తాము .. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని కూడా చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ రాజ్ తరుణ్ మాత్రం.. తాము ఎప్పుడు సహాజీవనం చేయలేదని కూడా ఆమె ఆరోపణల్ని ఖండిచాడు. దీంతో వీరిద్దరి రచ్చ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా.. తాజాగా, వీరిద్దరి కేసులో పోలీసులు విచారణ చేపట్టి చార్జీషీట్ ను దాఖలు చేశారు. దీనిలో అనేక  సంచలన విషయాలు వెల్లడించారు.


పూర్తి వివరాలు..
 


రాజ్ తరుణ్, లావణ్య కేసు టాలీవుడ్ లో రచ్చ గా మారింది. తొలుత లావణ్య.. రాజ్ తరుణ్ తనను పదేళ్ల పాటు వాడుకుని మోసం చేశాడని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. రాజ్ తరుణ్.. మాల్వీ మల్హాత్రా మోజులో పడి తనను దూరంపెట్టాడని ఆరోపణలు చేసింది. పదేళ్లపాటు  తనను అన్నిరకాలుగా వాడుకుని ఇప్పుడు మాత్రం.. డ్రగ్స్ తీసుకున్నానంటూ లేనీ పోనీ ఆరోపణలు చేస్తున్నాడని కూడా లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తో పాటు మాల్వీ మల్హాత్రాలపై కూడా.. లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో.. ఈ కేసులో ప్రతిరోజు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు వెలుగులోకి వచ్చాయి. 


రాజ్ తరుణ్, లావణ్య పదేళ్ల పాటు సహ జీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్‌తరుణ్-లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్‌షీట్‌లో రాజ్‌తరుణ్‌ను పోలీసులు నిందితుడిగా కూడా చేర్చారు. లావణ్యతో రాజ్‌తరుణ్‌ పదేళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. పదేళ్లపాటు రాజ్‌తరుణ్-లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని చార్జిషీట్‌లో తెలిపారు.


Read more: Snake in mouth Video: పామును నోట్లో పెట్టుకుని రీల్స్..కళ్లముందే షాకింగ్ ఘటన.. వీడియో వైరల్..  


లావణ్య చెబుతున్న విషయాల్లో కూడా.. అనేక వాస్తవాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో రాజ్‌తరుణ్ కు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. లావణ్య దీనిపై మాట్లాడుతూ.. తనను ఎన్నోరకాలుగా రాజ్ తరుణ్ వేధించాడని, లేనిపోనీ అభాండాలు వేశాడని కూడా లావణ్య చెప్పుకొచ్చింది. కానీ చివరకు నిజమే గెలిచిందని కూడా లావణ్య చెప్పుకొచ్చింది.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.