Pooja Hegde New Film: హ్యట్రిక్ ఫ్లాప్‌లు పడ్డా తగ్గని పూజా హెగ్డే జోరు.. మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్!
Pooja Hegde to act with Vijay Deverakonda in Jana Gana Mana. హ్యట్రిక్ ఫ్లాప్‌లు పడ్డా పూజా హెగ్డే జోరు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బుట్టబొమ్మకు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్.
Pooja Hegde to act with Vijay Deverakonda in Jana Gana Mana Movie: తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో పూజాకు మంచి పేరు వచ్చింది.
ప్రస్తుతం ఇండస్ట్రీ స్టార్ కథానాయికలలో పూజా హెగ్డే ఒకరు. ఇటీవల స్టార్ హీరోలకు, దర్శకనిర్మాతలకు పూజా 'మోస్ట్ వాంటెడ్' హీరోయిన్‌గా మారారు. 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర కూడా పడింది. పూజా ఉంటే సినిమా సక్సెస్ అనే టాక్ కూడా గత కొంత కాలంగా నడుస్తోంది. దువ్వాడ జగన్నాథం నుంచి వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న బుట్టబొమ్మ జైత్రయాత్రకు పాన్ ఇండియా సినిమా 'రాధే శ్యామ్' బ్రేకులు వేసింది. బీస్ట్, ఆచార్య సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. దాంతో పూజా హ్యట్రిక్ ఫ్లాప్‌లు ఖాతాలో వేసుకున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే పరిస్థితి ఎలా ఉందంటే.. ఒకప్పుడు 'గోల్డెన్ లెగ్' అని పిలిచినవారే, ఇప్పుడు 'ఐరెన్ లెగ్' అంటూ విమర్శిస్తున్నారు. అయితే హ్యట్రిక్ ఫ్లాప్‌లు పడ్డా పూజా జోరు మాత్రం తగ్గలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం బుట్టబొమ్మకు మరో పాన్ ఇండియా సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'జనగణమన' సినిమాలో పూజాకు అవకాశం వచ్చిందట.
జనగణమన సినిమా కోసం హీరోయిన్‌గా పలువురు బాలీవుడ్ తారల పేర్లు ఇటీవల వినిపించినా.. చివరికి పూజా హెగ్డే ఫైనల్ అయినట్టు సమాచారం. ఇటీవలే పూజాకు పూరి జగన్నాధ్ కథ వినిపించగా బాగా నచ్చిందట. దాంతో బుట్టబొమ్మ సినిమా చేయడానికి వెంటనే ఓకే చూపినట్టు చెప్పినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పూజా ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్ బాబు తదుపరి చిత్రంలో నటించనున్నారు. అంతేకాదు సల్మాన్ ఖాన్‌తో 'కభీ ఈద్ కభీ దివాళి', రణ్‌వీర్ సింగ్‌తో 'సర్కస్' సినిమాలో నటిస్తున్నారు.
Also Read: Jyestha Month 2022: మే 17 నుంచి జ్యేష్ఠ మాసం ఆరంభం.. ఈ 30 రోజుల్లో ఈ పనులు చేస్తే అంతా శుభమమే
Also Read: David Warner Record: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.