Jyestha Month 2022: మే 17 నుంచి జ్యేష్ఠ మాసం ఆరంభం.. ఈ 30 రోజుల్లో ఈ పనులు చేస్తే అంతా శుభమమే

Jyestha month 2022 begins May 17th. జ్యేష్ఠ మాసంలో ఆదివారం ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. ఆదివారం ఉపవాసం చేయడం వల్ల సూర్యభగవానుడి విశేష అనుగ్రహం లభిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2022, 10:46 AM IST
  • మే 17 నుంచి జ్యేష్ఠ మాసం ఆరంభం
  • ఈ 30 రోజుల్లో ఈ పనులు చేస్తే అంతా శుభమమే
  • జ్యేష్ఠ మాసంలో ఉపవాసం చాలా ముఖ్యం
Jyestha Month 2022: మే 17 నుంచి జ్యేష్ఠ మాసం ఆరంభం.. ఈ 30 రోజుల్లో ఈ పనులు చేస్తే అంతా శుభమమే

Jyestha month 2022 begins May 17th, Thesse Does to become a rich: హిందూ మతంలో ప్రతి నెలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెల ఏదో ఒక దేవతలను పూజించడం వల్ల విశేష అనుగ్రహం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. ప్రస్తుతం వైశాఖ మాసం కొనసాగుతుండగా.. మరికొద్ది రోజుల్లో జ్యేష్ఠ మాసం ఆరంభం అవనుంది. ఈ ఏడాది జ్యేష్ఠ మాసం మే 17న ఆరంభం అయి జూన్ 14న ముగుస్తుంది. ఈ నెలలో సూర్యుని ప్రతాపం బాగా ఉంటుంది. మండే కిరణాలు భూమిని బాగా వేడిక్కిస్తాయి. అందుకె జ్యేష్ఠ మాసంలో సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు చేస్తారు.

జ్యేష్ఠ మాసంలో ఆదివారం ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. ఆదివారం ఉపవాసం చేయడం వల్ల సూర్యభగవానుడి విశేష అనుగ్రహం లభిస్తుంది. ఉపవాసం ఉండే వ్యక్తి జీవితంలో అపారమైన పురోగతిని, మంచి ఆరోగ్యం, గౌరవం మరియు బలమైన విశ్వాసం పొందుతాడు. ఇది కాకుండా ఈ నెలలో కొన్ని నియమాలు పాటిస్తే.. జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు వస్తాయి. అంతేకాదు చాలా పుణ్యం కూడా దక్కుతుంది. 

# జ్యేష్ఠ మాసంలో జలదానం చేయడం చాలా ముఖ్యం. సాధారణంగా జ్యేష్ఠ మాసంలో భానుడు బగబగమంటాడు. అందుకే భూమిలో నీటి మట్టం పడిపోతుంది. కాబట్టి మనుషులు, జంతువులు, పక్షులకు తాగునీరు అందించాలి. అలాగే చెట్లకు, మొక్కలకు నీరు పోయాలి. ఇలా చేయడం వలన సూర్య దేవుడు మరియు వరుణ దేవుడు సంతోషపడతారు. 

# జ్యేష్ఠ మాసంలో కుండలలో నీటిని దానం చేయడం చాలా పుణ్యంగా భావిస్తారు. వీలైతే చలివేంద్రాలను పెట్టండి లేదా పెట్టిన చోట మీవంతు సాయం చేయండి.

# జంతువులు మరియు పక్షులకు నీరు అందించండి. మీ బాల్కనీ లేదా టెర్రస్‌లో పక్షులకు గింజలు, నీటిని ఉంచండి.

# మీరే ఎక్కువగా నీరు త్రాగండి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యలో బయటకు వెళ్లవద్దు.

# పేదలకు, నిరుపేదలకు మందులు, పండ్లను దానం చేయండి. 

# సత్తు దానం చేయడం కూడా చాలా మంచిది. 

Also Read: David Warner Record: డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు.. ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు!

Also Read: Umran Malik Fastest Delivery: ఐపీఎల్‌‌లో ఉమ్రాన్ మాలిక్ సరికొత్త రికార్డు... తన రికార్డు తానే బద్దలు కొట్టుకున్న బౌలర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x