Poonam Pandey Family Missing: బాలీవుడ్ నటి పూనమ్ పాండే నిన్న ఫిబ్రవరి 2వ తారీఖున సర్వైకల్ క్యాన్సర్‌తో కన్ను మూసింది. తరచుగా వివాదాల్లో నిలిచే ఈ హీరోయిన్ చివరిగా లాకప్ అనే రియాలిటీ షోలో కనిపించింది. మొదట్లో ఈ హీరోయిన్ మరణ వార్త విని అందరూ ఇదేదో పి ఆర్ స్టంట్ అనుకున్నారు. అయితే తను మరణించింది అనే సంగతిని పూనమ్ పాండే మేనేజర్ పరుల్ చావ్ల సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ధృవీకరించారు. 32 సంవత్సరాల వయసులో ఎంతో భవిష్యత్ ఉన్న ఈ హీరోయిన్ క్యాన్సర్‌తో మరణించడంతో సెలబ్రిటీలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదల్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన పూనమ్ పాండే బోల్డ్ షూట్స్, వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచేవారు. అందుకే బాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు ఈ హీరోయిన్ అంటే తెలియని వారు లేరు. ముఖ్యంగా 2011 లో పూనమ్ పాండే క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే తాను టీమ్ ఇండియా కోసం గ్రౌండ్‌లో నగ్నంగా తిరుగుతానని ప్రకటించి సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. అంతేకాదు అప్పుడు ఇండియా నిజంగానే వరల్డ్ కప్ గెలవడంతో  తన మాట నిలబెట్టుకోవాలని చేసిన ప్రయత్నాన్ని బీసీసీఐ అడ్డుకుంది. కాగా ప్రస్తుతం ఈ హీరోయిన్ మరణించాక కూడా కొన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయి.


పూనం పాండే మరణించింది అని ఆమె మేనేజర్ తెలిపిన కానీ ఇప్పటివరకు ఆమె బాడీ అయితే ఎవరికి కనిపించలేదు. అంతేకాకుండా ఇప్పటికీ ఈ విషయంపై పూనమ్ పాండే కుటుంబం స్పందించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూనమ్ పాండే ఫ్యామిలీకి చివరిగా పూనమ్ పాండే చెల్లెలు ఈ హీరోయిన్ మరణ వార్త తెలిపిందట. ఇక ఆ తర్వాత నుంచి పూనమ్ ఫ్యామిలీ కానీ తన చెల్లెలు కానీ కనిపివ్వడం లేదు. ఇదొక మిస్టరీగా ఉంటే మరొక విషయం ఏమిటి అంటే ..ఒకవేళ నిజంగానే ఈ హీరోయిన్ చనిపోతే తన మృతదేహం ఎక్కడా అని సందేహాలు మొదలయ్యాయి.


నిన్న పూనమ్ పిఆర్ టీం సోషల్ మీడియా అకౌంట్లో ‘‘మాకు పూనమ్ పాండే అక్క నుండి ఫోన్ వచ్చిందని తన మరణం గురించి స్పష్టం చేస్తున్నాం. కుటుంబం నుండి మరింత సమాచారం అందగానే అందరికీ అప్డేట్ చేస్తాం. వెంటనే ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తాం’’ అని తెలిపింది. అయితే దీనిపైన  ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈ హీరోయిన్ సిస్టర్ ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించగా.. తన ఫోన్ రీచ్ అవ్వడం లేదని సమాచారం. అంతే కాకుండా ఒకవేళ పూనమ్ పాండే మరణిస్తే.. తన మృతదేహం ఎక్కడ ఉంది? అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి? లాంటి అనుమానాలు కూడా ఫ్యాన్స్‌లో మొదలయ్యాయి. ప్రస్తుతం పూనమ్ పాండే నివాసముంటున్న ఇంటి దగ్గర కూడా ఆమె బాడీ గురించి విచారణ జరపగా.. అక్కడ ఎవరికీ ఈ విషయం గురించి తెలియదని తెలుస్తోంది.


Also read:  Kumari Aunty Food Point: కుమారి ఆంటీకి సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. నెట్టిజన్ల ప్రశంసలు..


Also read:  EPFO Balance Check: UAN నంబర్ తో సంబంధం లేకుండా ఇలా సింపుల్ గా పీఎఫ్‌ బ్యాలన్స్ చెక్ చేసుకోండి..



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook