కరోనా వైరస్ (CoronaVirus) ఓవైపు ప్రాణాలు తీస్తుంటే, మరోవైపు సెలబ్రిటీలు తమకు ఇదే అవకాశంగా భావించి పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. తాజాగా హాలీవుడ్ నటి, పాప్ స్టార్ అరియానా గ్రాండే(27) వంతు వచ్చింది. అమెరికా సింగర్ అరియానా గ్రాండే వివాహం (Ariana Grande Marriage) ఆమె బాయ్‌ఫ్రెండ్‌‌, రియల్ ఎస్టేట్ ఏజెంట్ డాల్టన్ గోమెజ్(25)తో జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీకెండ్‌లో అమెరికా సింగర్ అరియానా గ్రాండే వివాహం జరిగినట్లు ఆమె ప్రతినిధి వెల్లడించారు. కేవలం రెండు కుటుంబాల సభ్యులు మాత్రమే వివాహానికి హాజరయ్యారు.  పీపుల్స్ మ్యాగజైన్‌కు అరియానా గ్రాండె, రియల్ ఎస్టేట్ ఏజెంట్ డాల్టన్ గోమెజ్ వివాహ ((Ariana Grande Wedding) వార్త చెప్పడంతో వైరల్ అవుతోంది. 5 నెలల కిందట నిశ్చితార్థం చేసుకున్న అరియానా గ్రాండె, డాల్టన్ గోమెజ్ వివాహం నిరాడంబరంగా కేవలం 20 మంది సన్నిహితుల సమక్షంలో జరిగింది. ఇలా వివాహం జరిపించడంపై కుటుంబసభ్యులు సైతం అంతగా సంతోషంగా లేరని టీఎండబ్ల్యూ వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది.


Also Read: Jr Ntr birthday: తారక్ బర్త్ డే నాడే ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ప్రకటన ?


మూడో లవ్ లక్సెస్..
నటి, సింగర్ అరియానా గ్రాండె గతంలో రెండు పర్యాయాలు ప్రేమలో పడింది. మూడో ప్రేమను మాత్రం పెళ్లివరకు తీసుకొచ్చిందని హాలీవుడ్‌లో టాక్. తొలుత 2018లో సాటర్‌డే నైట్ లవ్ కమెడియన్ పీటె డేవిడ్‌సన్‌ను ప్రేమించింది. అయితే 5 నెలల తరువాత బ్రేకప్ అయింది. ఆ తరువాత ర్యాపర్ మ్యాక్ మిల్లర్‌, అరియానా గ్రాండే ప్రేమించుకున్నారు. కానీ డ్రగ్ ఓవర్‌డోస్ కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై మిల్లర్ చనిపోయాడు. 2020 జనవరి నుంచి రియల్ ఎస్టేట్ ఏజెంట్ డాల్టన్ గోమెజ్, అరియానా గ్రాండే డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెద్దలు వీరి వివాహం నిరాడంబరంగా జరిపించారు. 


Also Read: Pawan Kalyan తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్న Jacqueline Fernandez


ఇన్‌స్టాగ్రామ్‌లో నెంబర్ వన్..
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక పాలోయర్లు సొంతం చేసుకున్న మహిళగా అమెరికన్ పాప్ స్టార్ అరియానా గ్రాండే నిలిచింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను 235 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు ఉన్నారు. మూడో స్థానంలో హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్ నిలిచాడు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook