Venu Swami Comments on Rakul: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు.. రకుల్ ఎంగేజ్‌మెంట్ ఆగిపోనుందట..!!
ప్రముఖ టాలీవుడ్ సెలెబ్రెటీల ఆస్ట్రాలజర్ వేణు స్వామి మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసారు.. సమంత-నాగచైతన్య విషయంలో జరిగినట్టే.. రకుల్ ప్రీత్ సింగ్ -జాకీ భగ్నానీల ఎంగేజ్‌మెంట్ ఆగిపోతుందని.. వారు విడిపోనున్నారని కామెంట్స్ చేశారు.
Venu swami Shocking Comments on Rakul Preeths Engagement: ప్రముఖ టాలీవుడ్ ఆస్ట్రాలజర్ (Tollywood Popular Sstrologer) వేణు స్వామి (Venu Swami) గురించి చాలా మందికి తెలిసిందే.. టాలీవుడ్ సెలెబ్రెటీల జ్యోతిష్యాన్ని చెప్పే వేణు స్వామి మొన్న సమంత, నాగ చైతన్యల (Samantha-Nagachaitanya) గ్రహ స్థితి బాగోలేదని త్వరలో విడిపోతారని కామెంట్లు చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. అయన చెప్పినట్టుగానే వాళ్లు ఇద్దరు విడిపోవటంతో వేణు స్వామి జ్యోతిష్యానికి విశిష్టత చాటుకుంది. జనాలు కూడా వేణు స్వామి తరువాత ఏం చెప్పబోతున్నాడా అని ఎదురుచూసేంత ఆసక్తి రేపారు వేణు స్వామి.
అయితే ఇపుడు మరో సంచలనానికి తెర లేపారు వేణు స్వామి. టాలీవుడ్ లో మరో మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preeth Sing), ఆమె బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీలు (Jackky Bhagnani) పెళ్లి చేసుకోబోతున్నారు.. అయితే ఇపుడు వేణు స్వామి వారిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. వీరిద్దరూ కూడా ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అవటంతో పాటు.. శాశ్వతంగా చెప్పి విడిపోతారని వేణు స్వామి మరోసారి వార్తల్లో నిలిచారు.
Also Read: India Vs Pakistan: గెలుపు తరువాత భావోద్వేగాయానికి గురైన బాబర్ అజామ్ తండ్రి.. వీడియో వైరల్
జాకీ భగ్నానీ వృశ్చిక రాశి, రకుల్ ప్రీత్ సింగ్ ది మిథునం రాశి.. రానున్న రోజుల్లో ఈ రెండు రాశుల గ్రహస్థితి అసలు బాగోలేదని తెలిపారు. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ (Rakul Engagement may get cancelled) అవుతుందని... శాశ్వతంగా వీడిపోనున్నారని వేణు స్వామి (Venu Swami) తెలిపారు. అయితే సమంత- నాగచైతన్య విషయంలో నిజమైన ఈయన జ్యోతిష్యం రకుల్- జాకీ భగ్నానీ (Rakul Preeth- Jackky Bhagnani) విషయంలో నిజమవుతుందా..?? అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.
వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వగా.. సమంత దారిలోనే రకుల్ కూడా నడుస్తుందా..? అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వేణు స్వామి చెప్పినట్లు రకుల్ ప్రీత్ ఎంగేజ్‌మెంట్ కు బ్రేకులు పడి ఇద్దరు విడిపోతారా..?? లేక పబ్లిక్ లో పాపులారిటీ కోసం వేణు స్వామి చేస్తున్న స్టంటా...?? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఏదురుచూడాల్సిందే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి