India Vs Pakistan: గెలుపు తరువాత భావోద్వేగాయానికి గురైన బాబర్ అజామ్ తండ్రి.. వీడియో వైరల్

ప్రపంచకప్ లో భారత్ పై గెలవటం పాకిస్తాన్ జట్టుదే కాదు.. ఆ దేశ ప్రజల కళ.. ఆ కళ తన కొడుకు సారథ్యంలో నెరవేరటంతో బాబర్ ఆజం తండ్రి స్టేడియంలో బావోద్వేకానికి గురయ్యారు. ఆ వీడియో మీరే చూడండి 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 12:38 PM IST
  • వరల్డ్ కప్ లో భారత్ పై గెలవటం పాకిస్తాన్ కళ
  • కళ నెరవేరటంతో పాకిస్తాన్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి
  • విజయం తరువాత భావోద్వేగానికి గురైన బాబర్ తండ్రి.. వీడియో వైరల్
India Vs Pakistan: గెలుపు తరువాత భావోద్వేగాయానికి గురైన బాబర్ అజామ్ తండ్రి.. వీడియో వైరల్

Babar Azam Father get Emotional after Winning: క్రికెట్ ప్రపంచం మొత్తం ఎదురు చూసిన మ్యాచ్ ముగిసింది. దుబాయ్ (Dubai) స్డేడియంలో టీమిండియా Vs పాకిస్తాన్ (Team India Vs Pakistan) మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 World Cup) మ్యాచ్‌లో పాకిస్తాన్ చరిత్ర తిరగరాసింది. ఇప్పటి వరకూ టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) ఇండియాపై తొలి విజయాన్ని నమోదు చేసి... రికార్డు నెలకొల్పింది. 

మొదట టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన భారత్ తడబడిన.. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  57 పరుగులు, రిషభ్‌ పంత్‌ 39 పరుగులు చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి 151 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ ముందు ఉంచారు.. కానీ లక్ష్యం స్వలం అయినప్పటికీ.. పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (Babar Azam), మొహమ్మద్ రిజ్వాన్ (Mohammad Rizwan) నిలకడ ఆటతీరుతో 10 వికెట్లతో గెలిచిన సంగతి తెలిసిందే.. 

Also Read: Mann ki Baat: ఆ కాలం చెల్లింది..మహిళలే ఇక కీలకమంటున్న ప్రధాని మోదీ

అయితే  మొహమ్మద్‌ రిజ్వాన్‌ 55 బంతుల్లో 79 నాటౌట్‌, బాబర్‌ ఆజమ్‌ 52 బంతుల్లో 68 నాటౌట్‌ గా నిలిచి.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. 152 పరుగులు లక్ష్యాన్ని ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే  విజయం సాధించటంతో పాకిస్తాన్ జట్టుతో పాటు.. పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయింది. 

బాబర్ అజాం (Babar Azam) తండ్రి కూడా మ్యాచ్‌ను దుబాయ్ స్టేడియంలో తిలకిస్తున్నారు.. అయితే విజయం తరువాత బాబర్ తండ్రి భావోద్వేగానికి గురయ్యారు (Babar Father got Emotional). కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ కప్ (World Cup)లో భారత్ పై గెలవటం పాకిస్తాన్ జట్టు మరియు ఆ దేశ ప్రజల కళ.. ఆ కళ తన కొడుకు సారథ్యంలో తీరటంతో బాబర్ తండ్రి ఆనందంతో కన్నీరు పెట్టుకున్నవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Also Read: Sardar Udham Movie: సర్దార్ ఉద్దమ్ చిత్రం ఆస్కార్‌కు ఎంపిక ఎందుకు కాలేదో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News