Devi Nagavalli In Pushpa: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ న‌టిస్తున్న పుష్ప ది రూల్ మూవీ 2024లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఒక‌టి. ఈ చిత్రం ఆగ‌స్ట్ 15న రిలీజ్ కాబోతోంది. 2021లో వచ్చి.. పాన్ ఇండియా రేంజ్‍లో సెన్సేషనల్ హిట్ కొట్టింది పుష్ప పార్ట్ వన్. ఈ చిత్రానికి కానీ అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకి సీక్సెల్‍గా ప్రస్తుతం ఈ పుష్ప 2: ది రైజ్ రూపొందుతోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొద్దిరోజులుగా ఆలస్యమవటూ వస్తున్న ఈ చిత్రం షూటింగ్ పైన ప్రస్తుతం ఎక్కువగా కాన్సెంట్రేట్ చేస్తున్నారు సుకుమార్. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని అన్ని విధాల ఆలోచిస్తూ.. ఎక్కడ పొరపాటు లేకుండా చూసుకుంటున్నారని టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 కోసం సుకుమార్ ఓ యాంకర్ దగ్గర పాఠాలు కూడా నేర్చుకుంటున్నాడట. ఆ బుల్లితెర పాపులర్ యాంకర్ తాను ఫ్రీగా ఉన్న సమయంలో  పుష్ప 2 సెట్స్ కి వచ్చి మరి సినిమా కోసం పనిచేస్తోందట. ఇంతకీ ఆ యాంకర్ ఎవరనుకుంటున్నారా?.. ఆమె మరెవరో కాదు ప్రముఖ న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి.. బిగ్ బాస్  లో సైతం కనిపించి మెప్పించిన ఈ యాంకర్ సుకుమార్ దగ్గర పుష్ప సినిమా కోసం పనిచేస్తున్నారట. 


టీవీ9 ఛానల్ లో న్యూస్ యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న దేవి నాగవల్లి ఆ తర్వాత బిగ్ బాస్ లో పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది. అయితే నాగవల్లికి ముందు నుంచి సినిమాల మీద మక్కువ ఎక్కువే. తన సినిమాల్లో ఏదన్నా ముఖ్య విభాగంలో పనిచేయాలి అని అనుకున్న.. అది కుదరక యాంకర్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం సుకుమార్ వల్ల సినిమాలకు పనిచేసే అవకాశం వచ్చింది.


నాగవల్లిని పుష్ప సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చెయ్యమని సుకుమార్ అడగగా.. అప్పుడు ఆమెకు ఉన్న వర్క్ షెడ్యూల్స్ వాళ్ళ కుదర్లేదంట. అయితే పుష్ప 2 సినిమాలో పుష్ప రాజ్ కనపడకుండా పోయినప్పుడు మీడియాలో హడావిడి, యాంకర్స్ అతని గురించి చెప్పడం, లైవ్ రిపోర్టింగ్.. ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయని ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఆ సీన్లు అన్నీ చాలా రియలిస్టిక్ గా రావడానికి సుకుమార్ కి నాగవల్లి హెల్ప్ కావాల్సి వచ్చిందట. ఇక దీని కోసం సుకుమార్ దేవి నాగవల్లిని పిలిపించారని సమాచారం.


దేవి నాగవల్లి కీ మీడియాలో చాలా అనుభవం ఉండటంతో.. పుష్ప సినిమాలో ఈ మీడియా సీన్స్.. గురించి సుకుమార్ దేవి నాగవల్లి దగ్గర చాలా నేర్చుకుంటున్నారట. రిపోర్టింగ్ సీన్స్.. ఆ సీన్స్ లో పరికరాలు ఏవేవి చూపించాలి.. అనే అన్నిటి పైన దేవి నాగవల్లి సుకుమారికి క్లాస్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.


ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ లో వైరల్ గా మారింది. మరి దేవి స్క్రీన్ మీద కనిపిస్తుందా లేక తెరవెనుకే మాత్రమే ఈ సినిమా కోసం కష్టపడిందా.. తెలియాలంటే పుష్ప 2 రిలీజ్ వరకు ఆగాల్సిందే.


పుష్ప 2: ది రూల్ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా చేస్తుండగా.. ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, ప్రకాశ్ రాజ్, కీలకపాత్రలు పోషిస్తున్నారు. 


Also Read: Yatra 2 Movie: యాత్ర-2 టీజర్‌ వచ్చేస్తోంది.. పోస్టర్ రిలీజ్


Also Read: Petrol And Oil Tankers: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌, ఆయిల్‌ ట్యాంకర్ల సమ్మె విరమణ


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook