Rakshitha Suresh Road Accident: ప్రముఖ సింగర్ ఒకరు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 2015 వ సంవత్సరంలో సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ప్రస్తుతం టాప్ సింగర్ గా అనేక అవకాశాలు అందుకుంటున్నారు రక్షిత సురేష్ . ఈ మధ్యనే పొన్నియన్ సెల్వన్ 2 సినిమా కోసం పాట పాడిన ఆమె రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ రోజు తాను ఒక మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యానని తాను ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొని రోడ్డు పక్కకి నెట్టు వేయబడింది అని చెప్పుకొచ్చారు. తాను మలేషియా నుంచి బయలుదేరేందుకు ఎయిర్ పోర్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ 10 సెకండ్ల సమయంలో తన జీవితం అంతా కళ్ళముందు కనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Anasuya Bharadwaj: దేవరకొండ ఫాన్స్ ని గిల్లి.. జిమ్లో భర్తతో వర్కౌట్స్ మొదలెట్టిన అనసూయ


ఎయిర్ బ్యాగ్స్ కి థాంక్స్ చెప్పిన ఆమె అవి కనక లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పుకొచ్చింది. జరిగింది గుర్తుతెచ్చుకుంటే ఇప్పటికీ వణికి పోతున్నానని కానీ తన డ్రైవర్ తనకు గాని తనతో పాటు ప్రయాణిస్తున్న మరొక వ్యక్తికి గాని ఎలాంటి దెబ్బలు తగలలేదని మేమంతా సేఫ్ గానే ఉన్నామని చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయి అని చెప్పుకొచ్చింది. తాను ఇంకా బతికున్నానంటే చాలా గ్రేట్ ఫుల్ అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక ఆమె పెట్టిన పోస్ట్ కి సంగీత ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ రియాక్ట్ అవుతున్నారు. సింగర్ గీతా మాధురి అయితే థాంక్ గాడ్ నువ్వు త్వరగా కోలుకోవాలని కామెంట్ పెట్టింది. ఇక రక్షిత సురేష్ ఇటీవలే పొన్నియన్ సెల్వన్ రెండో భాగానికి సంబంధించిన తమిళ్ వర్షన్ కోసం ఒక పాట పాడగా తెలుగులో కూడా ఆమె అనేక పాటలు పాడారు. దీంతో ఆమె తెలుగు సింగర్ గా కూడా అందరి కీ పరిచయమే. ఇక ఆమె కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. 
Also Read: Sreemukhi Photos: నైటు గౌనులో శ్రీముఖి కవ్వింత..ఇన్నర్స్ కనిపించేలా పరువాల విందు!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook