Anasuya Bharadwaj: దేవరకొండ ఫాన్స్ ని గిల్లి.. జిమ్లో భర్తతో వర్కౌట్స్ మొదలెట్టిన అనసూయ

Anasuya Bharadwaj Gym wear photos: పరోక్ష వ్యాఖ్యలతో విజయ్ దేవరకొండ అభిమానులను రెచ్చగొట్టిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సైలెంట్ గా తన భర్తతో కలిసి జిమ్ములో వర్కౌట్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మరో చర్చకు తెరలేపింది. ఆమె షేర్ చేసిన ఫోటోలు మీరు కూడా చూసేయండి. 
 

  • May 07, 2023, 17:43 PM IST
1 /5

తాజాగా విజయ్ దేవరకొండ అభిమానులను పరోక్షంగా టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా కొత్త వివాదానికి కారణమైన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు సైలెంట్ అయింది.  

2 /5

 హీరోలు తమ అభిమానులను ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఎందుకు కంట్రోల్ లో పెట్టుకోరంటూ ప్రశ్నించిన ఆమె ఆదివారం నాడు తన భర్తతో కలిసి జిమ్ములో బిజీ అయిపోయింది. తన భర్త భరద్వాజ్ తో కలిసి జిమ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది యాంకర్ అనసూయ.   

3 /5

ఆమె షేర్ చేసిన ఫోటోలు అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ ద్వారా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న అనసూయ ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలకి కూడా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.   

4 /5

అయితే సినిమా అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉండడంతో అటు షోని ఇటు సినిమాలను మేనేజ్ చేసుకోలేక తాను జబర్దస్త్ కి గుడ్ బై చెప్పానని ముందు చెప్పినా తరువాత కంటెంట్ బాగుండటం లేదని అందుకే తాను జబర్దస్త్ కి గుడ్ బై చెప్పినట్లు తర్వాత చెప్పుకొచ్చింది ఈ భామ.     

5 /5

ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పోస్టుకు కూడా విజయ్ దేవరకొండ అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు మీరు చూసేయండి.   

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x