Posani Krishna Murali Appointed as AP Film Development Corporation Chairman: కాంగ్రెస్ తో విభేదించి సొంతంగా వైయస్సార్ కాంగ్రెస్ అనే పార్టీ స్థాపించిన వాటి నుంచి వైఎస్ జగన్ కు సినీ పరిశ్రమ నుంచి అండగా నిలబడుతున్న పోసాని కృష్ణమురళికి కీలక పదవి దక్కింది. ఎంతోకాలంగా జగన్ కు నమ్మకస్తుడిగా సినీ పరిశ్రమ నుంచి వ్యవహరిస్తున్న పోసాని కృష్ణమురళిని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తర్వాత పూర్తిగా సినిమాలకు పరిమితమైన పోసాని కృష్ణమురళి రాజకీయాల్లోకి రాకుండా బయట నుంచి జగన్ కు మద్దతు ఇస్తూ జగన్ మీద పల్లెత్తు మాట అన్నా విరుచుకుపడే సినీ పరిశ్రమ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. గతంలోనే ఆయనకు ఈ పదవి వస్తుందని ఊహాగానాలు అనేకసార్లు తెరమీదకు వచ్చాయి కానీ ఎట్టకేలకు దాని నిజం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.


గతంలో ఈ చైర్మన్ పదవిని జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉన్న విజయ్ చందర్ నిర్వహించేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో పోసాని కృష్ణ మురళి నియామకం జరిగింది. ఇక మరోపక్క 2019 ఎన్నికల ముందు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి జై జగన్ నినాదం అందుకున్న ఆలీకి కూడా ఇటీవల ఒక ప్రభుత్వ పదవి వరించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు.


నిజానికి తెలుగుదేశం హయాంలో అంబికా దర్బార్ బత్తి తయారీ సంస్థ నిర్వాహకులు, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌‌గా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సీనియర్ నటుడు బాలచందర్ పని చేశారు. అయితే ఆయన నియామకం కంటే ముందే ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌గా మోహన్ బాబు పేరు కూడా వినిపించింది. కానీ ఎట్టకేలకు పోసానిని ఆ పదవి వరించడం గమనార్హం.


Also Read: Manchu Vishnu - Prabhudeva: జిన్నా డిజాస్టర్ తో బాధపడుతున్న మంచు విష్ణుకు జాక్ పాట్?


Also Read: Heroines Rare Medical Conditions: సమంత సహా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్న హీరోయిన్లు వీరే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook