Pawan Kalyan: మరోసారి సింగర్ గా మారనున్న పవన్ కళ్యాణ్.. ఆ సినిమా కోసమే!
Pawan Kalyan OG: తెలుగు హీరోలు నటించడమే కాకుండా కొన్నిసార్లు తమ సినిమాలలో పాటలు కూడా పాడుతుంటారు. అలాంటి విన్నతమైన ప్రయత్నం చేసిన వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు.. కాగా ఇప్పుడు మరోసారి మన పవర్ స్టార్ సింగర్ గా మారనున్నారట..
Pawan Kalyan to Sing A Song: చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. వీరందరూ కూడా ఏదో ఒక సినిమాలో పాట పాడిన హీరోలే. ఇక సీనియర్లను ఫాలో అవుతూ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాలలో సాంగ్స్ కోసం తమ గొంతుని ఇచ్చారు.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సింగర్స్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో పాడిన కాటమరాయుడు సాంగ్ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించిందో ఆ పాట అందుకు రెండింతలు పాపులారిటీ తెచ్చుకునింది. ఆ సినిమా తరువాత మరోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతివాసి చిత్రంలో కూడా ఒక సాంగ్ పాడారు పవన్ కళ్యాణ్. సినిమా డిజాస్టర్ గా మిగిలిన పవన్ కళ్యాణ్ పాడిన పాట మాత్రం హిట్ గానే నిలిచింది. అయితే ఆ తరువాత సింగింగ్ జోలికి పోలేదు మన పవర్ స్టార్.
కానీ త్వరలోనే తన సినిమా కోసం మళ్లీ పాడేందుకు గొంతు సవరించుకోబోతున్నాడట ఈ హీరో. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే.. సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న ఓజీ. ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉండగా..ఈ ప్రచారం గురించి సంగీత దర్శకుడు తమన్ స్వయంగా స్పందించాడు.
ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడేందుకు ఒక మంచి సందర్భం ఉందని.. ఆ దిశగా ఆలోచిస్తున్న మాట వాస్తవమే అని తమన్ వెల్లడించాడు. దీంతో మళ్ళీ పవన్ పాట వినబోతున్నామని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా పవన్ లిరిక్స్ కూడా రాస్తారన్న విషయం మనకు తెలిసిందే. మరి ప్రస్తుతం పవన్ పాడబోయే పాటు కి ఆయనే లిరిక్స్ రాసుకుంటారా లేకపోతే ఇంకెవరైనా రాస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఎక్కువగా చాలా తమాషాగా ఉందే సాంగ్స్ పాడుతూ ఉంటాడు. అయితే ఈ మధ్య విడుదలైన టీజర్ చూస్తే ఓజీ పూర్తి సీరియస్ సినిమాలా కనిపిస్తోంది. మరి ఈ చిత్రం కోసం పవన్ ఎలాంటి పాట పాడతారో వేచి చూడాలి.
Also Read: Rat found in Online Food: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్.. చచ్చిన ఎలుకను తిన్న యువకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter