Prabhas Adipurush Out of Sankranthi Race: ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ చాలా కాలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నిజానికి సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు కానీ అదే సమయానికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమాలు విడుదలకు రంగం సిద్ధమైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ రెండు సినిమాలను నిర్మిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయినా సరే ఈ రెండు సినిమాలను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ఒకే నిర్మాణ సంస్థ రెండు సినిమాలు విడుదల చేయదు కాబట్టి ఆది పురుష్ మేకర్స్ తమ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు అందుకే అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వెనక్కి తగ్గకపోవడంతో తమ సినిమాని వాయిదా వేయాలని ఆదిపురుష్ టీమ్ నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.


ఇప్పటికీ ఈ సినిమా గ్రాఫిక్స్ అని చెబుతున్నా అసలు కారణం మాత్రం బాలకృష్ణ , చిరంజీవి వంటి సీనియర్ హీరోలతో అది కూడా అవుట్ అండ్ అవుట్ మాస ఎంటర్టైనర్లుగా రూపొందిన సినిమాలతో పోటీ పడడం కాస్త ఇబ్బందికరమైన విషయమే అని భావించి సినిమా యూనిట్ ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఎంత పాన్ ఇండియా హీరో అయినా ఎక్కువగా కలెక్షన్లు రాబట్టాల్సింది తెలుగు రాష్ట్రాల నుంచే. సంక్రాంతికి ప్రకటించాం కదా అని విడుదల చేస్తే నందమూరి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలతో ఖచ్చితంగా కలెక్షన్లు డివైడ్ అవుతాయి.


అది మేకర్స్ కు పెద్ద దెబ్బే అవుతుంది అని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆదిపురుష్ వెనకడుగు వేయడంతో అఖిల్ ఏజెంట్ సినిమా సంక్రాంతికి విడుదల అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిపురుష్ సినిమాను తానాజీ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలు ఇప్పటికే తెరమీదకు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటించగా రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఆంజనేయుడు పాత్రలో దేవదత్త నాగే నటిస్తున్నారు . టి సిరీస్ సంస్థ ఈ సినిమాని భారీ బడ్జెట్లో నిర్మించింది. తెలుగులో ఈ సినిమాని యూవీ ప్రొడక్షన్స్ సంస్థ పెద్ద ఎత్తున విడుదల చేస్తోంది. 


Also Read: Mrunal Thakur Saree Photos: బ్లాక్ శారీతో హీటు పెంచేస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?


Also Read: Divi Vadthya Pantless Photos: ప్యాంటేసుకోవడం మరచి దివి అందాల ఆరబోత.. వెయిట్ చేస్తున్నానంటూ పోస్ట్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook