Prabhas, Kriti Sanon Engagement: మాల్దీవ్స్‌లో ప్రభాస్, కృతిసనన్ ఎంగేజ్మెంట్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Prabhas, Kriti Sanon Engagement News : ఉమైర్ సంధు ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ప్రభాస్, కృతిసనన్ వచ్చే వారం మాల్ధీవుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ ట్వీట్ చేశాడు. వారి ఎంగేజ్మెంట్ పట్ల ఆనందం వ్యక్తంచేస్తున్నట్టుగా ఉమైర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas, Kriti Sanon Engagement News: ప్రభాస్ పెళ్లిపై బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చాడు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టాపికే.. అదే సమయంలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడూ అంతుచిక్కని ఒక మిలియన్ డాలర్ ప్రశ్నే. ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు, ఎందుకు, ఎలాంటి వార్తలు వస్తాయో అర్థం కాకుండానే వార్తలొస్తుంటాయి. ప్రభాస్, అనుష్కలకు ముడిపెడుతూ ఎన్నోసార్లు పెళ్లి వార్తలొచ్చాయి. ఎన్నోసార్లు ప్రభాస్, అనుష్క ఇద్దరూ సున్నితంగానే తిరస్కరిస్తూ వచ్చారు.
ఎప్పుడైతే ఆదిపురుష్ మూవీ సెట్స్‌పైకి వెళ్లిందో.. అప్పటి నుంచి ఆ సినిమాలో ప్రభాస్ సరసన సీత పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటి కృతి సనన్ పేరుతో ముడిపెడుతూ ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతంలోనే వార్తలొచ్చాయి. ప్రభాస్‌తో పెళ్లి వార్తలపై స్పందించిన కృతి సనన్.. అందులో నిజం లేదని.. అదంతా ఉత్తుత్తి గాసిప్సేనని కొట్టిపారేసింది.
ఇదిలాఉండగా తాజాగా ఫేమస్ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. ప్రభాస్, కృతిసనన్ వచ్చే వారం మాల్ధీవుల్లో ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారు అంటూ ట్వీట్ చేశాడు. వారి ఎంగేజ్మెంట్ పట్ల ఆనందం వ్యక్తంచేస్తున్నట్టుగా ఉమైర్ సంధు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అప్పటి నుంచే వైరల్‌గా మారిన ప్రభాస్, కృతి సనన్ రిలేషన్ షిప్
ఝలక్ దిక్లా జా డ్యాన్స్ రియాలిటీ షో ఫినాలే ఎపిసోడ్లో భేడియ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ప్రభాస్, కృతి సనన్ ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని పరోక్షంగా హింట్ ఇచ్చేశాడు. కృతి సనన్ ఇక్కడ ఎందుకు మిస్ అయ్యిందంటే.. ఆమె ప్రస్తుతం మరొకరి మనసులో ఉందని వరుణ్ ధావన్ వ్యాఖ్యానించాడు. అంతటితో ఆగని వరుణ్ ధావన్.. కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ ప్రస్తుతం ముంబైలో లేడని.. అతడు దీపికా పదుకునేతో షూటింగ్ లో బిజీగా ఉన్నాడని హింట్ ఇచ్చాడు.
వరుణ్ ధావన్ చెప్పిన సమయంలో దీపికా పదుకునెతో షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో మరెవరో కాదు.. మన టాలీవుడ్ మాచో మ్యాన్ ప్రభాసే. అవును.. ఆ సమయంలో ప్రభాస్, దీపికా పదుకునె ఇద్దరూ ప్రాజెక్ట్-కే మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. దీంతో వరుణ్ ధావన్ చెప్పిన దాని ప్రకారం కృతిసనన్ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు.. ప్రభాసే అని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అప్పటి నుంచి ప్రభాస్, కృతిసనన్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ తరచుగా వార్తలొస్తూనే ఉన్నాయి.
తాజాగా ఉమైర్ సంధు చేసిన ట్వీట్‌లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఏకంగా వచ్చే వారమే మాల్దీవుల్లో ప్రభాస్, కృతిసనన్ ఎంగేజ్మెంట్ అంటూ స్పష్టంచేశాడు. " నిప్పు లేనిదే పొగ రాదు.. అలాగే ఏదో ఒక సమాచారం లేనిదే ఉమైర్ సంధు ఈ ట్వీట్ చేయడు " అని బాలీవుడ్ మీడియా చెప్పుకుంటోంది. ఈసారి కూడా ఈ ఇద్దర్లో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ అసలు విషయం బయటికి వచ్చే ఛాన్స్ లేదు. ఏం జరగనుందో వేచిచూడాల్సిందే మరి.
ఇది కూడా చదవండి : Kiara Advani Wedding: ఎట్టకేలకు ప్రియుడిని వివాహమాడిన కియారా అద్వానీ.. కానీ?
ఇది కూడా చదవండి : Siya Gautam married: పెళ్లి చేసుకున్న రవితేజ హీరోయిన్.. వరుడు ఎవరంటే?
ఇది కూడా చదవండి : Kiara Advani Wedding Pics : కియారా అద్వాణీ సిద్దార్థ్ మల్హోత్రల పెళ్లి.. రామ్ చరణ్ కామెంట్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook