Adipurush Day 2 Collections: రెండో రోజు కూడా ఆగని కలెక్షన్ల వర్షం.. 200 కోట్ల క్లబ్ లో `ఆదిపురుష్`
Adipurush 2nd day Collections: ప్రభాస్- ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్ల రాబట్టింది. తాజా కలెక్షన్స్ తో ఈ మూవీ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ సినిమా రెండో రోజు ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Adipurush Day 2 Collections: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రం మిక్సడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల వర్షం మాత్రం ఆగడం లేదు. రెండో రోజు కూడా ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబట్టింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ముందుగానే లక్షల్లో టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యయి. ఈ ఏడాది రిలీజైన చాలా సినిమాల రికార్డులను ఈ మూవీ బద్దలు కొట్టింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చ బాగానే నడుస్తోంది. వీఎఫ్ఎక్స్ మాత్రమే బాగున్నాయని.. మిగతా సినిమా అంతా బాగులేదని చాలా మంది విమర్శలు గుప్పించారు.
జూన్ 16న దేశవ్యాప్తంగా దాదాపు 4000 స్క్రీన్లలో విడుదలైంది ఆదిపురుష్. తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపు 1100 స్క్రీన్లలో రిలీజైంది. టీ సీరిస్ అధినేతలు భూషణ్ కుమార్, కిషన్ కుమార్ దాదాపు రూ.500 కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం అన్ని భాషలలో మొదటి రోజు వందకోట్లకు పైగా వసూలు చేసింది. అయితే తొలిరోజుతో పోలిస్తే రెండో రోజు కలెక్షన్లు కాస్త తగ్గాయనే చెప్పాలి. సెకండే డే ఈ మూవీ దాదాపు రూ.60-80 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మూడో రోజు నుంచి కలెక్షన్లు పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ చిత్రంపై విపరీతంగా నెగిటివ్ టాక్ వస్తుంది. ఓ పక్క వివాదాలు, మరోపక్క కోర్టు కేసులతో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంటూ వస్తుంది. అయితే ఈ సినిమా ఫ్యాన్స్ ను పూర్తి నిరాశ పరిచిందనే చెప్పాలి.
Also Read: Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ
ఇంతకుముందు తాన్హాజీ లాంటి సినిమాని తీసిన ఓం రౌత్ ఈసారి ఆదిపురుష్ సినిమాని ఆశించిన స్థాయిలో తీయలేకపోయాడు. ఆకట్టుకులేకపోయిన వీఎఫ్ఎక్స్, పేలని డైలాగ్లు, ఎమోషన్స్ లేకపోవడం, స్లో స్క్రీన్‌ప్లే కారణంగా ఈ మూవీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోలేకపోయింది. నటీనటుల ఎంపిక కూడా సరిగా లేదని కొంత మంది ఫ్యాన్స్ అంటున్నారు. దీంతో ఈ సినిమాపై నెట్టింట విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ శ్రీరాముడిగా, బాలీవుడ్ నటి కృతి సనన్ సీతగా, నటుడు సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు.
Also Read: Adipurush OTT Streaming: ‘'ఆదిపురుష్'’ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి