Raja Saab Poster: సలార్ తో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్టు కే లాంటి భారీ బడ్జెట్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే మధ్యలో ఎప్పుడు గ్యాప్ దొరికిన మరో పక్క మారుతీ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటున్నారు మన డార్లింగ్.  మారుతీ దక్షకత్వంలో వస్తున్న సినిమాపై ప్రభాస్ అభిమానులకు అలానే తెలుగు సినీ ప్రేక్షకులకు అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఈ మధ్య అన్ని సినిమాలలో రెబల్ స్టార్ గా కనిపించిన ప్రభాస్.. చాలా రోజుల తర్వాత మారుతి చిత్రంలో డార్లింగ్ లుక్స్ లో కనిపించడం. ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఫోటోలు చూసి అందరూ మళ్లీ మన ప్రభాస్ ని గతంలో లాగా ఈ చిత్రంలో చూడొచ్చేమో అని సంబరపడిపోతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రం షూటింగ్ కూడా సగం అయిపోయిందని సమాచారం. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుండగా ఇందులో నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు ఈ చిత్రం టైటిల్ అందరూ రాజా డీలక్స్ అని అనుకుంటూ వచ్చారు. కానీ సంక్రాంతి పండుగ కానుకగా పండుగ తెచ్చే పోస్టర్ తో అఫీషియల్ టైటిల్ ని ప్రకటించేశారు మేకర్స్.


చాలా రోజుల వరకు ప్రభాస్ మారుతి సినిమా షూటింగ్ గురించి అధికారికంగా బయట పెట్టని ఆ సినిమా యూనిట్ ఈ మధ్యనే ఈ చిత్రం గురించి 
అధికారికంగా ప్రకటించి ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూస్తారంటూ సంక్రాంతికి సినిమా టైటిల్ ప్రకటిస్తాం అని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక మాటని నిలబెట్టుకుంటూ ఈ సినిమాకి రాజా సాబ్ అనే టైటిల్ ని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ని కూడా రిలిజ్ చేశారు.


 



ఈ పోస్టర్ నిజంగానే పక్కా సంక్రాంతి భోజనం లాగా ఉంది. ఈ పోస్టర్ లో ప్రభాస్ లుంగీ పైకెత్తి సంక్రాంతికి వచ్చే అల్లుడిలా ఉన్నాడు. పోస్టర్ అంతా చాలా కలర్ ఫుల్ గా ఉంది. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా 2024 చివర్లో రిలీజవుతుందని సమాచారం. 


Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు


Also Read: Home Loan Rates: హోమ్‌ లోన్స్‌ గుడ్‌ న్యూస్‌..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్‌..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook