Project K Cast Remuneration: `ప్రాజెక్టు-కే` సినిమాకు ప్రభాస్, కమల్ హాసన్ లకు కళ్లు చెదిరే పారితోషికం.. ఎంతో తెలుసా?
Project K Cast: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్టు-కే. తాజాగా ఈ మూవీ నటీనటుల పారితోషికానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Project K Cast And Crew Remuneration: 'ఆదిపురుష్' ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా ప్రభాస్ తర్వాత సినిమాలపైనే ఉంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్టు-కే చిత్రాల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సలార్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. మరోవైపు ప్రాజెక్టు-కే కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మహానటితో తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగాన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుక రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది, మిగిలిన పనులు మెరుపు వేగంతో జరుగుతున్నాయి.
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూయర్ అశ్వినీ దత్ సుమారు రూ.600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రా పనిచేస్తుండగా... సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటానీ తదితరులు ముఖ్యమైన ప్రాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా యెుక్క మోషన్ పోస్టర్ ను త్వరలో రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్ కు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో తెలుసుకుందాం.
ప్రాజెక్టు-కే నటీనటుల పారితోషికం:
ప్రభాస్: రూ. 150 కోట్లు
కమల్ హాసన్: రూ. 20 కోట్లు- రూ. 30 కోట్లు (కొన్ని రోజులకు మాత్రమే)
అమితాబ్ బచ్చన్: రూ. 10 కోట్లు
దీపికా పదుకొనే: రూ. 10 కోట్లు
దిశా పటానీ- రూ.10 కోట్లు
నటీనటుల రెమ్యూనరేషన్: రూ. (210 కోట్లు సుమారుగా)
మిగతా బడ్జెట్: రూ. 400 కోట్లు.
Also Read: Project K Update: రెండు పార్టులుగా ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి