Raja Saab: సెంటిమెంట్ ఫాలో అవుతున్న ప్రభాస్.. వర్క్ అవుట్ అవుతుందా?
Raja Saab Update: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న.. రాజా సాబ్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఫ్యాన్ గ్లింప్స్ తో పాటు చిత్ర బృందం విడుదల తేదీను కూడా అధికారికంగా ప్రకటించింది. అయితేదీని వెనుక ఒక సెంటిమెంట్.. కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Prabhas Raja Saab Shooting: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కమర్షియల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా రాజా సాబ్. సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పుడు కంటే సినిమాకి సంబంధించిన ఫ్యాన్ గ్లింప్స్ విడుదలైన తరువాత సినిమా మీద ఆసక్తి విపరీతంగా పెరిగింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సినిమాలలో చూసిన వింటేజ్ ప్రభాస్ లుక్.. మళ్లీ ఈ సినిమాలో కనిపిస్తుంది అని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఫ్యాన్ గ్లింప్స్ తో పాటు చిత్ర బృందం సినిమాకి సంబంధించిన విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న వేసవి కాలంలో ఈ సినిమా విడుదల అవుతుంది అని.. చిత్ర బృందం ప్రకటించింది. దీంతో వరుసగా ప్రభాస్ సినిమాలు రాబోతుండడంతో ఫాన్స్ చాలా సంతోషిస్తున్నారు.
అయితే మరికొందరు ఫాన్స్ సినిమా విడుదల తేదీ గురించి ఒక సెంటిమెంట్ బయటకు తీసుకువచ్చారు. ప్రభాస్ కెరియర్ లో ఇప్పటికీ ఏప్రిల్ లో చాలానే సినిమాలు విడుదలయ్యాయి. పౌర్ణమి, మున్నా, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, ఆఖరికి బాహుబలి 2 సినిమాలు కూడా.. ఏప్రిల్ లోనే విడుదలయ్యాయి. ఇందులో పౌర్ణమి మాత్రమే బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లు అందుకోలేక పోయింది. మిగతా అన్నీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమాలే.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ లో విడుదల అవుతున్న రాజా సాబ్ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అని.. కచ్చితంగా కమర్షియల్ సక్సెస్ అవుతుంది అని.. ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పైగా రొమాంటిక్ కామెడీ సినిమాలలో చూసి ప్రభాస్ ని చూసి చాలా కాలం అయిపోయింది. మరోవైపు ఇందులో హారర్ ఎలిమెంట్ కూడా జోడించడంతో.. ప్రేక్షకులకు మరింత ఆసక్తి వచ్చింది.
ఏదేమైనా నిన్న మొన్నటిదాకా సినిమా మీద పెద్దగా అంచనాలు లేకపోయినా.. ఇప్పుడు మాత్రం సినిమాపై బజ్ బాగా పెరిగింది. ఆ బజ్ తగ్గేలోపు సినిమాని విడుదల చేస్తే కచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.
Also Read: Constable Aspirants: అర్ధరాత్రి మళ్లీ నిరుద్యోగుల ఆందోళన.. దిల్‌సుఖ్‌నగర్ దిగ్బంధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook