Prabhas Friend: హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ దోస్త్.. 22 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ..
Prabhas Friend: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ సినిమాతో నటుడవగా పరిచయమయ్యాడు హను కోట్ల. ఈ సినిమాలో మూగవాడి పాత్రలో హీరోగా దోస్త్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఆ తర్వాత నటనలో శిక్షణ కోసం గ్యాప్ తీసుకొని ఇపుడు హీరోగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Prabhas Friend: హను కోట్ల ప్రభాస్ హీరోగా పరిచయమైన ‘ఈశ్వర్’ సినిమాలో అతని ఫ్రెండ్ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడు. ఆ తర్వాత యాక్టింగ్ మెరుగుపరుచుకోవాలనున్నాడు. అలాగే డైరెక్షన్ డిపార్టెంట్ లో టాలెంట్ చూపించాలనుకున్నాడు. కానీ అప్పటికే హైదరాబాద్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంలో ఉద్యోగరీత్యా బి.ఎ యాక్టింగ్, ఎం.ఎ. మీడియా డైరెక్షన్ కోర్సుల్లో విద్యార్థులకు బోధనా ఉపాధ్యాయుడిగా కొనసాగటం వల్ల ఈశ్వర్ తర్వాత ఎన్నో ఛాన్సులు వచ్చినా.. తగిన పాత్ర కోసం వెయిట్ చేశాడు. తాజాగా ఈయన 22 యేళ్ల ల్యాంగ్ గ్యాప్ తర్వాత ‘ది డీల్’ మూవీతో కథానాయకుడిగా పరిచయం కాబోతున్నాడు.
తెలుగు నాటక రంగంలో ఎంతో మందికి శిక్షణ ఇచ్చిన ఎంతో పేరు తెచ్చుకున్నారు హను కోట్ల. అంతేకాదు నాటక రంగంలో ఎన్నో గొప్ప ప్రయోగాలతో రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును సైతం గెలుచుకున్నారు. తనకున్న ఎంత అనుభవంతో ‘ది డీల్’ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెబుతున్నారు.
సిటడెల్ క్రియేషన్, డిజిక్విస్ట్ సంయుక్తంగా ‘ది డీల్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా హీరోతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు డాక్టర్ హను కోట్ల. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేతుల మీదుగా ‘ది డీల్’ మూవీ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ మూవీ మొదటి భాగం మొత్తం హైదరాబాద్ తో పాటు మలేషియాలో షూట్ చేసారు. ఇంకా కొంత పార్ట్ ను మలేషియాలో పూర్తి చేయనున్నారు. ఈ చిత్రం మొదటి భాగం దసరాకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ లుగా చందన, ధరణి ప్రియా నటించారు. రఘు కుంచె, రవి ప్రకాష్, మహేష్ పవన్, గిరి, వెంకట్ గోవాడ, శ్రీవాణి, సుజాత దిక్షిత్, సురభి లలిత ఇతర లీడ్ రూల్స్ లో యాక్ట్ చేశారు. ఈ సినిమాకు కెమెరా సురేందర్ రెడ్డి.. సంగీతం ఆర్.ఆర్. ధ్రువన్, ఎడిటర్ శ్రవణ్ కటికనేని వ్యవహరించారు.
ఇదీ చదవండి: చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..
ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.