Kalki 2898 AD 1st Day Box Office Collections: హిందీ సహా ప్యాన్ ఇండియా లెవల్లో ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ..
Kalki 2898 AD 1st Day WW Box Office Collections: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. దాదాపు నాలుగేళ్లుగా ఈ సినిమా యూనిట్ పడ్డ కష్టం ఫలించింది. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు అందరు ఊహించినట్టుగా హిందీ సహా అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్ దగ్గర కుమ్మిపడేసింది.
Kalki 2898 AD 1st Day WW Box Office Collections: వైజయంతీ మూవీస్ వంటి ప్రతిష్ఠాత్మక బ్యానర్ లో తొలిసారి ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 AD’ మూవీకి ముందు నుంచి మంచి హైప్ క్రియేట్ అయింది. అమెరికా వంటి ఓవర్సీస్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే అక్కడ ప్రీమియర్స్, ఫస్ట్ డే కలిపిదే దాదాపు $6 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసినట్టు బాక్సాఫీస్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంతేకాదు ఈ సినిమా 2024లో విడుదలైన చిత్రాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. అంతేకాదు మన దేశంతో పాటు హిందీ వెర్షన్ లో కూడా అతిపెద్ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ‘కల్కి 2898 AD’ మూవీ రికార్డులకు ఎక్కింది.
ప్రభాస్ వంటి పెద్ద కటౌట్ ఉన్న హీరోకు తెలుగు సహా ప్యాన్ ఇండియా ప్రేక్షకులు సాహో అంటూ సలాం కొట్టారు. అంతేకాదు హిందీలో తొలి రోజు దాదాపు రూ. 22.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించినట్టు ప్రముఖ బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. అంతేకాదు ఓవరాల్ గా హిందీలో రూ. 27.50 గ్రాస్ వసూల్లతో ఈ యేడాది హిందీ మార్కెట్ లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఫస్ట్ డే రూ. 190 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఒక రకంగా అన్ సీజన్ లో ఎలాంటి హాలీడే లేని టైమ్ లో ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మాములు విషయం కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ రోజు, రేపు శనివారం, ఆదివారం ఈ సినిమా వసూళ్లు పెరడగం గ్యారంటీ. ఇక నైజాంలో ఫస్ట్ డే దాదాపు రూ. 20 కోట్ల నెట్ షేర్ రూ. 40 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ రికార్డును మాత్రం క్రాస్ చేయలేకపోయింది. మొత్తంగా చూసుకుంటే పాజిటివ్ టాక్ తో ఈ సినిమా ముందు ముందు ఏ రేంజ్ వసూళ్ల సునామీ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter