Prabhas: కల్కి2898AD సినిమాకి ఆస్కార్..? ప్రభాస్ రేంజ్ మారిపోనుందా..!
Kalki2898AD for Oscars : కల్కి2898AD సినిమా ఆస్కార్ కి సెలెక్ట్ అయింది అంటూ..కొద్ది రోజులుగా వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించింది. అయితే ఈ చిత్రం నిజంగానే ఆస్కారికి సెలెక్ట్ అయిందో.. లేదో చూద్దాం
Kalki in Oscar 2024 race: దివంగత నటులు కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. ఈశ్వర్, రాఘవేంద్ర చిత్రాలతో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకొని, ఆ తర్వాత మాస్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు.ఇక అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ వంటి చిత్రాలతో తనలోని మరో యాంగిల్ ను అభిమానులకు పరిచయం చేసి డార్లింగ్ గా మారిపోయారు.
ఇదిలా ఉండగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఆ తర్వాత తీసిన.. ప్రతి పాన్ ఇండియా చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. చివరిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన పర్వాలేదనిపించుకున్నారు.ఇటీవలే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898AD సినిమా చేసి మళ్లీ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు ప్రభాస్.
Also Read: IAS Officers: ఆమ్రపాలితో సహా ఆ ఐఏఎస్‌లకు భారీ షాక్.. మొట్టికాయలు వేసిన క్యాట్
రూ.700 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా రూ.1800 కోట్లకు పైగా.. కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు కూడా తమ కెపాసిటీకి మించి నటించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రానికి అరుదైన గౌరవం లభించబోతుందని చెప్పవచ్చు. తాజాగా ఈ చిత్రం ఆస్కార్ 2025…నామినేషన్ లోకి రాబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ముఖ్యంగా ప్రభాస్ నటించిన ఈ సినిమా ఆస్కార్ 2025 లో ఉత్తమ విఎఫ్ఎక్స్ విభాగంలో.. ఆస్కార్ గెలుపొందే అవకాశం ఉందని కొంతమంది రూమర్స్ సృష్టిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ గ్రాఫిక్స్ తో పాటు విఎఫ్ఎక్స్ అద్భుతంగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక ఇదే జరిగితే ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని, ప్రపంచ స్థాయిగా గుర్తింపు లభిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఆస్కార్ 2025 నామినేషన్ జాబితా విడుదల చేసే వరకు ఎదురు చూడాల్సిందే.
Also Read: AP Cadre IAS: ఆంధ్రప్రదేశ్‌కు మేం వెళ్లలేం.. మళ్లీ కోర్టును ఆశ్రయించిన ఐఏఎస్‌లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి