Kalki 2898 AD OTT Streaming: ఆ రోజు నుంచే ప్రభాస్ ‘కల్కి ఓటిటీ స్ట్రీమింగ్.. అధికారిక ప్రకటన.. ?
Kalki 2898 AD OTT Streaming: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యాక్ట్ చేసిన సినిమా ‘కల్కి 2898 AD’. ఈ సినిమా రేపటితో 50 రోజుల రన్ పూర్తి చేసుకోబోతుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడని ఆడియన్స్ ఓటీటీలో ఎపుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Kalki 2898 AD OTT Streaming: రెబల్ స్టార్ ప్రభాస్..ఇది పేరు కాదు ఇట్స్ యే బ్రాండ్. ‘కల్కి 2898 AD’ చిత్రంతో ఇప్పటికే పలు రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీ వెయ్యి కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను దాటింది. అంతేకాదు ఈ సినిమా పూటకో రికార్డును బ్రేక్ చేస్తూ పోతుంది. ఇప్పటికే మనదేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన నాల్కో చిత్రంగా నిలిచింది. ఈ సినిమా కంటే ముందు బాహుబలి 2, కేజీఎఫ్ 2, ఆర్ఆర్ఆర్ తర్వాత మనదేశంలో అత్యధిక వసూళ్లను సాధించిన నాల్గో చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా $20 మిలియన్స్ డాలర్స్ రాబట్టి బాహుబలి 2 తర్వాత రెండో ప్లేస్ లో ఉంది.
అంతేకాదు కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ. 1151 కోట్ల గ్రాస్ (రూ. 570 కోట్ల షేర్) కలెక్షన్స్ ను ఇప్పటి వరకు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నేటితో బాక్సాఫీస్ దగ్గర ‘కల్కి’ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు ముగిసిందనే చెప్పాలి. రేపటి నుంచి థియేటర్స్ లో ‘డబుల్ ఇస్మార్ట్’, ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలు రాబోతున్నాయి. దాంతో పాటు హిందీలో కూడా పలు చిత్రాలు ఆగష్టు 15న థియేటర్స్ లో క్యూ కడుతున్నాయి. ఏది ఏమైనా బాహుబలి 2 తర్వాత సలార్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన ప్రభాస్.. ‘కల్కి 2898 AD’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకున్నాడు. తాజాగా కల్కి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషలకు సంబంధించి ఆగష్టు 23నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది.
మరోవైపు నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కు రానున్నట్టు సమాచారం. ఈ సినిమా విడుదలైన ఏడు వారాలకు ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఒక వారం రోజుల ఆలస్యంగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రభాస్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. ఈ యేడాది చివర్లో మంచు విష్ణుతో చేస్తోన్న ‘కన్నప్ప’ డిసెంబర్ లో విడుదలవుతోంది. అటు మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం’సినిమా కాస్త ఆలస్యం కానుంది. ఆ వెంటనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ ఈ యేడాది చివర్లో పట్టాలెక్కనుంది. అటు హను రాఘవపూడితో చేస్తోన్న ఫౌజీ, అటు సిద్ధార్ధ్ ఆనంద్ చిత్రాలు త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter