Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. ఇది ఓ పేరు కాదు.. ఓ బ్రాండ్.. దానిపైనే ‘కల్కి 2898 AD’ వరల్డ్ వైడ్ గా రికార్డు బ్రేక్  బిజినెస్ చేసింది. ప్రభాస్ కటౌట్ కు మంచి కథ, కథనం ఉంటే చాలు..బాక్సాఫీస్ దగ్గర మాయ చేయడం పక్కా అని మరోసారి ‘కల్కి’ మూవీ సక్సెస్ తో ప్రూవ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా..  $4.5 మిలియన్ కలెక్షన్స్ రాబట్టింది కల్కి మూవీ . ఇక మొదటి రోజే అక్కడ గా $5 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ లో కేవలం 9 రోజుల్లో ఈ సినిమా $15 మిలియన్  యూస్ డాలర్స్ కలెక్ట్ చేసి ఇప్పటికీ అప్రతిహతంగా దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో ఓవర్సీస్ లో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టిన సినిమా ఏది లేదు. ఓవర్సీస్ లో ఈ రేంజ్ వసూళ్లు రాబట్టి హీరోగా ప్రభాస్ స్టార్ పవర్ ఏంటో తెలియజేసింది. ఈ సినిమా ఇప్పటికే రూ. 800 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ఇక హిందీ మార్కెట్ లో భారత దేశంలో ఈ సినిమా రూ. 200 కోట్ల నెట్ వసూళ్లతో మరో బెంచె మార్క్ క్రియట్ చేసింది. ఓవరాల్ గా రూ. 412 కోట్ల షేర్ (రూ. 808 కోట్ల గ్రాస్) వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతుంది.


 నెక్ట్స్ వీకెండ్ వరకు ఈ సినిమా వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. ఒకవేళ అందుకుంటే ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ కెరీర్ లో రెండో వెయ్యి కోట్ల సినిమా అని చెప్పొచ్చు. తెలుగులో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ తర్వాత రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగా ‘కల్కి’ రికార్డులకు ఎక్కనుంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీటైంది. ఈ సినిమాకు ‘కల్కి 3102 BC’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ద్వాపర యుగంలో మహా భారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణ భగవానుని పరమపదించడంతో ద్వాపర యుగం అంతమై కలియుగం ప్రారంభమవుతోంది. ఈ సినిమా వచ్చే యేడాది మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. త్వరలో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు.  


Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.