Prabhas - Kalki 2898 AD: 'సలార్' సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌తో పాటు కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అంతేకాదు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన భారత్ టాప్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొణే, దిశా పటానీ నటించారు. మొత్తంగా భారీ క్యాస్టింగ్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఎన్నో అంచనాలున్నాయి. ఈ సినిమాను ఇపుడు 3D ఐమాక్స్ ఫార్మాట్‌లో కూడా రిలీజ్ చేయబోతనున్నట్టు సమాచారం. ఇప్పటికే దానికి సంబంధించిన వర్క్ కూడా పూర్తైయినట్టు సమాచారం. మొత్తంగా ప్రభాస్ కెరీర్‌లో తొలి సోషియో ఫాంటసీ.. టైమ్ మిషన్ నేపథ్యంలో తెరకెక్కోతున్న సైన్స్ ఫిక్షన్‌ మూవీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో ప్రభాస్.. భైరవతో పాటు పలు పరశురాముడు, మహా విష్ణువు, కర్ణుడు వంటి పలు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తంగా అభిమానులు ఏదైతే ప్రభాస్ నుంచి కోరకుంటున్నారో అంతకు మించి ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను జూన్ 27న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ సహా పలు అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.



ఈ సినిమా తరువాత ప్రభాస్.. 'ది రాజా సాబ్' మూవీ చేస్తున్నాడు. మారుతి మార్క్ కామెడీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా 1939 రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కనుంది. మరోవైపు సిద్ధార్ధ్ ఆనంద్ మూవీ లైన్‌లో ఉంది. అటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ ఈ యేడాది సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కనుంది. వీటిన్నటి కంటే ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2' మూవీ కంప్లీట్ చేయనున్నారు.


Also read: AP Elections Survey: ఏపీలో అధికారం ఎవరిది, జగన్‌కు క్లారిటీ వచ్చేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook