Prabhas Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి 2898 AD’ విడుదలతో థియేటర్స్ కు కళ కళ.. సంక్రాంతి తర్వాత పూర్వ వైభవం..
Prabhas Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. గత కొన్ని నెలలుగా థియేటర్స్ లో ప్రేక్షకులు లేక వెలవెల బోయిన థియేటర్స్ ఇపుడు కళ కళ లాడుతున్నాయి. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు థియేటర్స్ ఓనర్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Prabhas Kalki 2898 AD: తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ తర్వాత అత్యంత కీలకమైన సమ్మర్ లో పెద్ద సినిమాలేవి విడుదలకు నోచుకోలేదు. మరోవైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొనడంతో అందరి చూపు దానిపైనే ఉంది. ముందుగా మే 9న విడుదల చేద్దామనుకున్న ‘కల్కి 2898 AD’ మూవీని ఏపీ, తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసారు. అది కల్కి సినిమాకు కలిసొచ్చింది. పైగా వైజయంతీ మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ కు ప్రియమైన తెలుగు దేశం నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏపీలో కొలువు దీరడంతో టికెట్లకు పెంపుకు అనుమతులు ఆటోమేటిక్ గా వచ్చాయి. పైగా తెలంగాణలో కేవలం 8 రోజులు పెంచిన టికెట్ రేట్స్ అమల్లో ఉండనున్నాయి. కానీ ఏపీలో మాత్రం రెండు వారాలు పెంచిన టికెట్ రేట్స్ అమల్లో ఉండనున్నాయి. పైగా ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఎంతో కాలంగా థియేటర్స్ ముఖాలు చూడని ఫ్యామిలీ ఆడియన్స్ అక్కడికి క్యూ కడుతున్నారు. వాళ్లకు పెంచిన టికెట్ రేట్స్ భారంగా అనిపిస్తున్న .. మంచి చిత్రానికి ఈ మాత్రం టికెట్ రేటు పెట్టడానికి పెద్దగా వెనకాడటం లేదు.
పైగా ఈ సినిమాకు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఈ సినిమా సందడి కనిపిస్తోంది. రెబల్ స్టార్ కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి. మొన్నటి నుంచే కల్కి సినిమా టాకీస్ల దగ్గర అభిమానుల సందడి షురూ అయింది.
ఏ,బీ,సీ సెంటర్స్ మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా అన్ని టాకీస్ ల దగ్గర పండుగ వాతావరణం నెలకొంది. కల్కి సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. సమ్మర్ ముందు నుంచి ప్రేక్షకులు లేక వెలవెలబోయిన థియేటర్స్ ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులతో సందడి చేస్తున్నాయి. దీంతో ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యామిలీ ప్రేక్షకులు కల్కి సినిమా చూసేందుకు థియేటర్స్ క్యూ కడుతున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టికెట్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. రికార్డ్ స్థాయిలో స్క్రీన్స్ ఉన్నా..టికెట్స్ దొరకనంత క్రేజ్ తో కల్కి మూవీ ప్రదర్శితమవుతోంది. మన పురాణ ఇతిహాసాలకు, సైన్స్ ఫిక్షన్ జోడించి తెరకెక్కించిన ‘కల్’కి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాదు ఎంతో అద్భుతంగా కల్కి సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు, హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించిన వైజయంతీ మూవీస్ కు ప్రేక్షకులు ప్రశంసలు దక్కుతున్నాయి.
ఇదీ చదవండి: ‘కల్కి 2898 AD’ మూవీ రివ్యూ.. ఆకట్టుకునే ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter