Kalki 2898AD: ప్రభాస్ కల్కి కి వాయిదా.. దేవరాకి పోటీ తప్పదా
Prabhas: ప్రస్తుతం రాబోతున్న పాన్ ఇండియా సినిమాలలో తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉండే చిత్రం ప్రభాస్ కల్కి2898AD. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు నాగ్ అశ్విన్.
Kalki Release Date: నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కల్కి 2898AD. దాదాపు 800 కోట్లతో రానున్న ఈ సినిమాపై సినీ ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తరువాత నాగ్ అశ్విన్ ప్రభాస్ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా తప్పకుండా మరో సూపర్ హిట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కాగా ఇంకా కూడా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. అయితే ఈ చిత్రం పనులన్నీ ముగించుకొని మేలో విడుదల కానుందని సినిమా మేకర్స్ ఎప్పుడో ప్రకటించేశారు. ఈ సినిమాని నిర్మిస్తున్న వైజయంతి మూవీస్ కి ఎంతో సెంటిమెంట్ డేట్ మే 9. వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి, మహానటి సినిమాలు రెండు కూడా మే తొమ్మిదిన విడుదలై సూపర్ సక్సెస్ సాధించాయి. అందుకే ఈ చిత్రాన్ని కూడా మే 9న విడుదల చేయాలి అని నిర్ణయించుకున్నారు వైజయంతి మూవీస్.
అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది జరుగుతుందా అని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కల్కి రిలీజ్ డేట్ క్యాన్సిల్ అయి వాయిదా పడేలా ఉంది. అసలు విషయానికి వస్తే త్వరలో దేశమంతా ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. నిన్నే ఎన్నికల డేట్స్ ప్రకటించగా ఏపీ, తెలంగాణలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి అని ప్రకటించారు.
ఎలక్షన్ జరిగేటప్పుడు దాదాపు ఏ సినిమాలు రిలీజ్ కి ఆసక్తి చూపించవు. ఎందుకంటే చాలామంది పార్టీల ప్రమోషన్స్ లో బిజీగా ముందుగా.. మరి కొంతమంది ఎన్నికల అరేంజ్మెంట్స్ లో బిజీగా ఉంటారు. సాధారణ ప్రేక్షకులు కూడా సినిమాలకన్నా ఎక్కువ ఎన్నికలపై దృష్టి పెడుతూ ఉంటారు.
అలాంటి తరుణంలో థియేటర్స్ కి వచ్చి సినిమా చూసేంత టైం ఎవ్వరూ ఇవ్వరు. కానీ ప్రభాస్ కల్కి రిలీజ్ డేట్ కి ఎలక్షన్స్ డేట్ కి కేవలం మధ్యలో నాలుగు రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీంతో ఆరోజు కానీ పట్టు పట్టి వైజయంతి మూవీ రిలీజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ తప్పకుండా సినిమా పైన పడేలా ఉంది.
మరో విషయం ఏమిటి అంటే ఈ ఎలక్షన్స్ టైం లో టికెట్ రేట్లు పెంచే అవకాశం కూడా లేదు. దేశమంతా ఎన్నికల సీజన్ కాబట్టి పాన్ ఇండియా కూడా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే కలిగే సినిమాకి నష్టాలు తప్పవు. ఈ ఎలక్షన్స్ కి తగ్గకే రిలీజ్ చేస్తే పోతుందని చాలామంది కలిసి మేకర్స్ కి సర్ది చెప్తున్నట్లు వినికిడి. మరి అశ్విని దట్, నాగ అశ్విన్ ఇవన్నీ చూసుకొని కల్కి సినిమాని వాయిదా వేసే తట్లే ఉన్నారు అని సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాలి అంటే మాత్రం అధికారిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ చిత్రం పోస్ట్ పోన్ అయితే మాత్రం ఆ ప్రభావం మొత్తం దేవరా సినిమా పైన పడచ్చని వినికిడి. ఈ మధ్యనే విఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ వల్ల దేవర చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ కలిసి జూనియర్ ఎన్టీఆర్ దేవర రెండు కూడా ఆగస్టులో విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇదే కాని జరిగితే ప్రభాస్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ కైనా లేదా ఎన్టీఆర్ వల్ల ప్రభాస్ కైనా నష్టం కలగక మానేలా కనిపించడం లేదు.
Also read: Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు ఇఫ్తార్ విందులో అవమానం.. వైరల్ గా మారిన వీడియో ఇదే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook