Kalki Release Trailer: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కల్కి2898AD. ఈ చిత్రంపై ముందు నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మధ్య విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచగా.. ఈరోజు విడుదలైన రిలీజ్ ట్రైలర్ మరింత పెంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్ కల్కి 2898 ఏడీ నుంచి రిలీజ్ ట్రైలర్‌ను ఈరోజు సినిమా యూనిట్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్లో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ కళ్లు చెదిరిపోయేలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ త్రైలర్ లోనే స్పెషల్ సర్ ప్రైజ్ కారెక్టర్లను రివీల్ చేశారు. ఇక ఈ.. ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది. ఈ ట్రైలర్‌ విడుదలతో సినిమా మీద అంచనాలు.. ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి.  సమయం వచ్చింది అని అమితాబ్ డైలాగ్ తో మొదలైన ఈ ట్రైలర్.. ఆధ్యాంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగి ఫైనల్ గా ప్రభాస్.. ప్రిపేర్ అయి వచ్చాను అని చెప్పే డైలాగ్ తో ముగిసింది


 



జూన్ 27న కల్కి సినిమా థియేటర్లోకి రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్‌లో.. ప్రీ సేల్స్‌తోనే ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇక నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఆల్రెడీ రెండు మిలియన్ల డాలర్లకు పైగా రాబట్టేసింది.



ఇక బుధవారం ముంబైలో  కల్కి  ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరగగా.. ఈ ఈవెంట్ కి కూడా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్, దీపికా, అమితాబ్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలు ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఒకే స్టేజీపై కనిపించి ప్రేక్షకులకు మంచి వినోదం పంచారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్, పోస్టర్స్, మేకింగ్ వీడియోలు, ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తూ ఉండటంతో.. ప్రభాస్ అభిమానులు ఈ సినిమా రికార్డుల గురించి వెయిట్ చేస్తున్నారు.


Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో


Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి