Lokesh Kanagaraj:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కోలీవుడ్ లో మంచి పేరున్న డైరెక్టర్ల లో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. కార్తీ హీరోగా నటించిన ఖైదీ సినిమా తోనే బ్లాక్ బస్టర్ అందుకున్న లోకేష్ కనగరాజ్ ఈ మధ్యనే కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమాతో మరొక సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ రెండు సినిమాలకి ఈ మధ్య పెద్ద కనెక్షన్ ఇచ్చి తనదైన శైలిలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను కూడా సృష్టించారు. అందులో భాగంగానే ఇప్పుడు త్వరలో ప్రేక్షకులు ముందుకి రాబోతున్న సినిమా లియో. 


తలపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మిగతా రెండు సినిమాల లాగానే ఈ సినిమా కూడా భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఇప్పుడు లోకేష్ నెక్స్ట్ సినిమా విషయం ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.


తాజా సమాచారం ప్రకారం లోకేష్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక సినిమా ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లోకేష్ మీడియా ముఖంగా తెలియజేశారు. "ప్రభాస్ గారితో నేను చేస్తున్న సినిమా ఒక ఇండివిడ్యువల్ సినిమా. నా ముందు సినిమాల తో ఈ సినిమాకి ఎటువంటి సంబంధం ఉండదు. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా ఒక విభిన్నమైన ఎక్స్పీరియన్స్ ను ఇస్తుంది" అని సినిమా గురించి బాగానే హైప్ ఇచ్చారు లోకేష్.


ఇక ఇంతకుముందు ఒకసారి మాట్లాడుతూ పది సినిమాలు చేశాక సినిమాల నుంచి రిటైర్ అయిపోతాను అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే అందులో ఐదు సినిమాలు పూర్తయ్యాయి. మరి నెక్స్ట్ ఐదు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో ఇంకా తెలియాల్సి ఉంది. తాజాగా ఇప్పుడు ప్రభాస్ తో కూడా సినిమా చేస్తుండడంతో సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.


ప్రభాస్ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ కనగరాజ్ తన ఆఖరి సినిమాని ప్రభాస్ తో చేయబోతున్నట్లు చెప్పుకోవచ్చు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఆఖరి సినిమా కూడా కాబోతోంది అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు కానీ ఈ సినిమా కి ఎల్ సి యు కి ఎటువంటి సంబంధం ఉండదని లోకేష్ క్లారిటీ ఇవ్వడంతో ఈ పుకార్లు మళ్ళీ సద్దుమణిగాయి. మరోవైపు లోకేష్ విజయ్ తో ఒక సినిమా, కార్తీ తో ఖైదీ 2, కమల్ హాసన్ తో విక్రం 2, సూర్య హీరోగా రోలెక్స్ సినిమాలు కూడా చేయబోతున్నారు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..