Prabhas -Maruthi Movie Shoot May Start this Month: ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్లో ఒక సినిమా రూపొందే అవకాశం ఉందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు వెలువడలేదు. కానీ సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా షూటింగ్ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. అది కూడా నిజమే అని తెలుస్తోంది ప్రస్తుతానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ ఇంకా అగ్రిమెంట్ మీద సైన్ అయితే చేయలేదని అంటున్నారు. వీలైనంత త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేయాలని మారుతి భావిస్తున్నారు.


ఇది ఒక హారర్ కామెడీ అని ముందు నుంచి ప్రచారం జరుగుతుంది.  మారుతీ డైరెక్షన్లో వచ్చిన హారర్ కామెడీ మూవీ ప్రేమకదాచిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ ఈ సినిమా చేయడం ప్రభాస్ అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పటికే ప్రభాస్ చేస్తున్న దాదాపు అన్ని సినిమాలకు నెగిటివ్ ఫలితాలు వస్తూ ఉండడంతో వారంతా అయితే ఒక రకమైన టెన్షన్ వాతావరణంలో ఉన్నారు.


మారుతి సినిమా కనుక నెగిటివ్ అయితే ప్రభాస్ కెరియర్ మీద మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వారంతా భావిస్తున్నారు. ఇప్పటికే ఆది పురుష్ టీజర్ మీద భారీగా నెగెటివిటీ అయితే స్ప్రెడ్ అయింది. 3D స్క్రీన్స్ లో వాటిని ప్రాజెక్టు చేసి కాస్త సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చోట్ల ఈ 3డీ స్క్రీన్స్ ఉన్నాయనే విషయం మీద కూడా అవగాహన లేకుండా ఈ సినిమా 3Dలో ప్రొజెక్ట్ చేయడానికి సిద్ధమవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. చూడాలి మరి ఏం జరగబోతుందనేది.
Also Read: GodFather Collections : వంద కోట్ల పోస్టర్.. నెట్టింట్లో రామ్ చరణ్, చిరుపై ట్రోలింగ్


Also Read: Godfather Weekend Collections: గాడ్ ఫాదర్ వసూళ్లలో జోరు.. ఫస్ట్ వీకెండ్ ఎంత రాబట్టింది అంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook